`దేవదాసు`తో కెరీర్ ప్రారంభించిన హీరో రామ్ పోతినేని మాసీవ్ బ్లాక్ బస్టర్‌ని మాత్ర అందుకుంది ఇస్మార్ట్ శంకర్`తోనే. ఈ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకున్న రామ్ వసూళ్ల పరంగా కూడా కెరీర్ బెస్ట్ విజయాన్ని దక్కించుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించి చార్మితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
సినిమాలో రామ్ పాత్రని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఊర మాస్‌గా మలిచిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శనివారం రాత్రి జరిగిన జీ సినిమా అవార్డుల్లో ఈ చిత్రానికి నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. బెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్, బెస్ట్ సెన్సేషనల్ యాక్టర్, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగాల్లో పూరి జగన్నాథ్, రామ్, చార్మి, మణిశర్మలకు అవార్డులు దక్కాయి. పూరి, చార్మిలతో కలిసి పంచుకున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలోషేర్ చేసిన హీరో రామ్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
`నేను హీరోగా పరిచయం అయిన `దేవదాసు` చిత్రం జనవరి 11న రిలీజ్ అయింది. సరిగ్గా 14 ఏళ్ల తరువాత అదే రోజు అవార్డు అందుకున్నాను. ఇప్పటి వరకు నా ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. కానీ ఇప్పుడే నా జర్నీ మొదలైనట్లు అనిపిస్తోంది. మీ ప్రేమాభిమానాలకు, సహకారానికి ధన్యవాదాలు` అని రామ్ ట్వీట్ చేశారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36TtpmM
Comments
Post a Comment