పెరిగిన సెల్‌ఫోన్ వాడకం, సోషల్ మీడియా విస్తృతం కావడం స్టార్ డైరెక్టర్‌ల పాలిట శాపంగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించిన కీలక అంశాలు, ఫొటోలు లీక్ అవుతుండటం చిత్ర వర్గాలని కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం లీకుల కారణంగా దర్శకధీరుడు రాజమౌళి కంగారు పడుతున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. డీవీవీ దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ప్రారంభించిన దగ్గరి నుంచి లీకులు బెడద తప్పడం లేదు. ఆ మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సముద్రఖనితో పాటు కొన్ని పిక్స్ లీక్ కావడం చిత్ర బృందాన్ని భయాందోళనకు గురిచేసింది. తాజాగా అలాంటిదే మరొక కీలక పిక్ బయటికి రావడం సంచలనంగా మారింది.
ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్న సన్నివేశాల్ని ఇటీవల చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ సినిమాలో ఓ హైలైట్‌గా నిలుస్తుందని, రోమాంచితంగా వుంటుందని, ఈ సీన్ తెరపై చూసిన ప్రేక్షకులు థ్రిల్‌కు గురవుతారని చిత్ర బృందం భావించింది. అయితే ఆ సన్నివేశానికి సంబంధించిన ఓ ఫొటో బయటికి లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. లీక్ అయిన వెంటనే రంగంలోకి దిగిన రాజమౌళి కాపీ రైట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని ఆ పిక్‌ని తొలిగించేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు అనివార్యం అవుతుండటంతో సెట్‌లో మరింత కఠనంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NWm6n1
Comments
Post a Comment