ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య మన స్టార్ హీరోలు ఒకరిపై ఒకరి ఇష్టాన్ని బహిరంగపరుస్తున్నారు. ఒకరితో ఒకరు చాలా చనువుగా మెలుగుతున్నారు. ఇదివరకు జరిగినా చాలా ప్రైవేట్ గా ఉండేది వ్యవహారం. బయట ఎవరి తీరు వాళ్ళే అన్నట్లు ఉండేవారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారింది. ఒకరి సినిమాను మరొకరు పొగడడం, ఒకరి సినిమా ఫంక్షన్ లకు మరొకరు వెళ్లడం వంటివన్నీ అటు అభిమానులకు ఇటు సాధారణ ప్రేక్షకులకు కనువిందునే చెప్పాలి. ఈ నేపథ్యంలో బన్నీ సినిమాను తారక్ పొగడడం నిన్నంతా హాట్ న్యూస్ అయింది. ఇప్పుడు బన్నీ స్పందన కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.
అల వైకుంఠపురములో నిన్న విడుదలై మంచి టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాను చూసిన తారక్ కు తెగ నచ్చేసింది. వెంటనే సోషల్ మీడియాలో సినిమాను పొగిడేసాడు. బన్నీ చాలా ఎఫర్ట్ లెస్ గా నటించినట్లు, టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లు తారక్ చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనలోని రచయితను మరోసారి పూర్తి స్థాయిలో వాడాడని తారక్ చెప్పాడు. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి పూర్తి స్థాయిలో ఆనందిస్తారని తెలిపాడు. ఈ పొగిడే క్రమంలోనే అల్లు అర్జున్ ను బావా అనడం, త్రివిక్రమ్ ను స్వామి అనడం నెటిజన్లకు భలే ఆనందాన్నిచ్చింది.
అయితే దీనికి అల్లు అర్జున్ కూడా థాంక్యూ బావా. నీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఇద్దరం కలుద్దాం అని ట్వీట్ పెట్టాడు. రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఇలా ఒకరినొకరు బావ బావ అని పిలుచుకోవడం నిజంగా హర్షణీయం. ఇక అల వైకుంఠపురములో విషయానికొస్తే చాలా ఆహ్లాదంగా, హాయిగా సాగిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ ప్రేక్షకులు ఈ సినిమాను బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు ఇండియన్ మార్కెట్ లోనే కాక అటు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమాకు భీభత్సమైన ఊపు కనిపిస్తోంది. తొలిరోజు పూర్తవ్వకుండానే ఈ సినిమా 1 మిలియన్ దాటేసింది.
Bavaaaaaaaa ! Thank you very mucccchhhh . It’s was soo good talking to you … seee you soon ! https://t.co/qgp3b67jiz
— Allu Arjun (@alluarjun) January 12, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36RK7CU
Comments
Post a Comment