విజయ్ దేవరకొండ తన మాటలతో, చేస్టలతో ఇండస్ట్రీలోని ప్రతీ హీరోని ఆకట్టుకుంటున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మనసుని కూడా దోచుకోవడం ఆసక్తికరంగా మారింది. వరుస విజయాలతో క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తన క్రేజ్‌నే ఓ బ్రాండ్‌గా మార్చుకుని `రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` రిలీజ్ అవుతున్న సందర్భంగా బన్నీకి ప్రత్యేకంగా తన బ్రాండ్‌కు సంబంధించిన బట్టలకు గిఫ్ట్‌గా పంపించడం ఆసక్తికరంగా మారింది.
విజయ్ ఓ సందర్భంలో రౌడీ బ్రాండ్ బట్టల్ని పంనిస్తానని మాటిచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం బన్నీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బట్టల్ని పంపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించి విజయ్ పంపించిన గిప్ట్‌కు సంబంధించిన ఫొటోల్ని అభిమానుల కోసం షేర్ చేసి థ్యాంక్స్ చెప్పారు.
దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ `బన్నీ అన్నా `అల వైకుంఠపురములో` చిత్రానికి గుడ్ లక్. మాటిచ్చినట్టుగానే మీ కోసం ఈ కాస్ట్యూమ్స్‌ని ప్రత్యేకంగా తానే డిజైన్ చేశానని దుస్తులతో పంపిన ఓ లెటర్‌లో పేర్కొన్నారు. `అర్జున్‌రెడ్డి` సినిమా తరువాత నుంచి అల్లు అర్జున్‌తో విజయ్ దేవరకొండకు మంచి అనుబంధం ఏర్పడిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌లో విజయ్ గీత గోవిందం, ట్యాక్సీవాలా చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్నిసాధించాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/37UOxch
Comments
Post a Comment