సైలెంట్‌గా వచ్చి మోన్‌స్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. కన్నడ రాక్‌స్టార్ యష్ నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడ సినీ చరిత్రలోనే తిరుగులేని విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి తాజాగా పార్ట్ 2 రూపొందుతోంది. తొలి భాగం అనూహ్య సొంతం చేసుకుని భారీ క్రేజ్‌ని క్రియేట్ చేసుకోవడంతో పార్ట్ 2పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా చెప్పాలంటే ప్రేక్షకుల ఊహకు అందని స్థాయిలో పార్ట్ 2ని తెరపైకి తీసుకురాబోతున్నారట. సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నఈ చిత్ర షూటింగ్ అనుకున్న సమయం కంటే కొంత ఆలస్యంగా మొదలైంది. సమ్మర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కావడం వల్ల హరీబరీగా రిలీజ్ చేయాలనుకోవడం లేదట.
దాంతో సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్న పార్ట్ 2ని జూలై లేదా ఆగస్టులో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంజయ్‌దత్ అధీరాగా, రవీనా టాండన్ రమికా సేన్‌గా కనిపించబోతున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2sZEFPS
Comments
Post a Comment