ఒక బాష గొప్పతనం, ఆ బాషలో ఉండే యాస సౌందర్యం, ఆ యాసలో చెప్పే పాట అంతరార్ధం, ఆ పాటను తెరపై పండించే హీరోయిజం,ఆ హీరోయిజాన్ని సరైన బాటలో నడిపే దర్శకుని విజన్ ఇవన్నీ కలిపి ఆపాటను సూపర్ హిట్ చేసాయి. ఆ పాటే అల.. వైకుంతపురం సినిమాలో ఉండే సిత్తరాల సిరపడు పాటను నిజంగా జనాల్ గుండెల్లో గుచ్చేసాయి.
రీసెంట్ గా వైజాగ్ లో జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో హీరో అల్లు అర్జున్ పాట పాడిన గాయకుడు సూరన్న గారికి తన కోటు బహుకరించి మాటల్లో చెప్పలేని కృతజ్ఞతను పంచుకున్నాడు. ఇక అల్లు అరవింద్ గారైతే భావోద్వేగానికి లోనై, రచయితను, గాయకుడిని ఆలింగనం చేసుకున్నారు. ఈ పాట రాసిన రచయిత ఎల్ఐసి సీనియర్ ఉద్యోగి బల్లా విజయ్ కుమార్. పాడిన గాయకుడు ఉత్తరాంధ్ర వాసి సూరన్న గారు. ఇక ఈ ఇద్దరినీ కలిపి సరళమైన పాటలో కూడా లోతైన, గంభీరమైన అర్ధం వచ్చేలా చేసిన గురూజీ త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
మొదట వాడుకలో ఉన్న, జానపద గీతాలలో సుమారు 200 పాటలు పరిశీలించిన వీళ్ళు, చివరికి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు సొంతగా ఒక గీతాన్ని రెడీ చేసారు. ఈ పాటలో హీరో ఒక పల్లెటూరి కుర్రాడి అల్లరి చేష్టలు వివరిస్తూ అంతర్లీనంగా శ్రీ కృష్ణుడి లీలలను ప్రస్తావించారు. సినిమా రిలీజ్ కు ముందు సర్ప్రైజ్ గా దాచిపెట్టిన ఈపాట ఇప్పుడు ఫుల్ వైరల్ అయ్యింది. ఇక మీదట కూడా తెలుగు బాష,యాస అందరికీ అందేలా ఇటువంటి వారు ప్రయత్నించాలని కోరుకుందాం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2vh1yiv
Comments
Post a Comment