సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రాలు మొదటి నుండి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మొదటిగా ఈ చిత్రాలు కాంబినేషన్ పరంగా క్రేజ్ ను సొంతం చేసుకుంటే ఆ తర్వాత ప్రమోషన్స్ పరంగా ట్రేండింగ్ లో నిలిచాయి. కానీ ఇప్పుడు వేరే కారణాలతో ఈ రెండు చిత్రాలు వార్తల్లో నిలుస్తున్నాయి. అదే రిలీజ్ డేట్. మొదట ఈ రెండు చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను జనవరి 12కి ప్రకటించాయి. ఆ ప్రకారంగానే ప్రమోషన్స్ లోకి దిగాయి. అయితే డిస్ట్రిబ్యూటర్ల నుండి ఒత్తిడి రావడంతో ఆ నిర్ణయం నుండి వెనక్కి తగ్గారు. సరిలేరు నీకెవ్వరు తమ రిలీజ్ డేట్ ను జనవరి 11కి మార్చుకుంది. అల వైకుంఠపురములో సినిమా ఎప్పట్లానే జనవరి 12న విడుదలకు సిద్ధమైంది.
నాలుగు రోజుల క్రితం వరకూ ఈ సినిమా నుండి ఏ వీడియో వచ్చినా, పోస్టర్ వచ్చినా ఆయా రిలీజ్ డేట్ లను పోస్టర్ పై ఉండేలా చూసుకున్నారు. అయితే ఇంతలో ఏమైందో తెలీదు కానీ అల వైకుంఠపురములో జనవరి 10న రావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. మొదట ఈ వార్తలను ఎవరూ నమ్మలేదు. అయితే ఈ రెండు చిత్రాలకు ఒక రోజు వ్యవధిలో సెన్సార్ పూర్తయింది. రెండు చిత్రాలకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆ విషయాన్ని తెలుపుతూ రెండు చిత్రాల నుండీ పోస్టర్లు వచ్చాయి. దీనిపై రిలీజ్ డేట్ వేయకుండా కేవలం సంక్రాంతి విడుదల అని మాత్రమే వేశారు. అంటే రిలీజ్ డేట్ మార్పు విషయంలో వచ్చిన వార్తలు నిజమే అనుకోవాలి. అల వైకుంఠపురములో నిర్ణయం మార్చుకుని జనవరి 10కి వచ్చే పక్షంలో తమ సినిమాను కూడా అదే రోజున దించాలని సరిలేరు నీకెవ్వరు బృందం భావిస్తోంది.
సినిమా రిలీజ్ డేట్ లకు మరో వారం రోజులు కూడా లేని పక్షంలో ఈ తకరారు ఏంటో అర్ధం కాక బయ్యర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈరోజో, రేపో ఈ విషయంపై సందిగ్దత తొలగే అవకాశముంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36tUooY
Comments
Post a Comment