స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. పూర్తి క్లాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు మాస్ సెంటర్లలో పెద్దగా ఆదరణ ఉండదని అంతా భావించారు. అయితే ఈ సినిమా సెంటర్లకు, క్లాస్ లకు సంబంధం లేకుండా దూసుకుపోతోంది. సీడెడ్ లో ఈ చిత్రానికి వస్తున్న ఆదరణే దీనికి ఉదాహరణ. ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లకు ఖుషీ అయిపోయిన అల వైకుంఠపురములో నిన్న థాంక్యూ మీట్ పెట్టింది. దాంట్లో అల్లు అర్జున్ ఉత్సాహంగా మాట్లాడాడు. చాలా విషయాలపై స్పందించాడు.
స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోలు సాధారణంగా మాట్లాడడానికి ఇష్టపడని నేపోటిజం మీద కూడా స్పందించాడు. ఒక పూజారి తన వారసత్వాన్ని కుమారులకు, మనవాళ్లకు ఎలా ఇవ్వాలి అని అనుకుంటాడో మేము కూడా అలాగే ఆలోచిస్తాం. అభిమానులను అలరించడానికి కష్టపడతాం. దీన్ని నేపోటిజం అని అనుకుంటే, అవును నేపోటిజం ఉంది అని కుండబద్దలు మాట్లాడాడు. బన్నీ ఇంత ధైర్యంగా మాట్లాడడం అక్కడనున్న కొంతమందిని ఆశ్చర్యపరిచింది.
ఇక అదే విధంగా తాను నా పేరు సూర్య రిలీజ్ తర్వాత వేసిన ఒక ట్వీట్ గురించి స్పందించాడు అల్లు అర్జున్. ఆ ట్వీట్ ప్రకారం “నా పేరు సూర్య రిలీజ్ తర్వాత నా నెక్స్ట్ సినిమా గురించి మీరందరూ ఎదురుచూస్తున్నారని తెలుసు. కానీ అది ఇంకా టైమ్ పడుతుంది. మీకు నిజాయితీతో కూడిన హిట్ ఫిల్మ్ ఇవ్వాలని అనుకుంటున్నా. దానికి కొంత టైమ్ ఆలస్యమవుతుంది” అని అర్ధంవచ్చేలా ట్వీట్ చేసాడు బన్నీ.
సినిమా రిలీజ్ తర్వాత ఒక నెటిజన్ తనకు పంపిన మెసెజ్ ను భరణి గారు చదువుతారు అని మైక్ ను తనికెళ్ళ భరణికి ఇచ్చాడు. వెంటనే భరణి మైక్ అందుకుని “చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జి” అని చదివి మైక్ తిరిగి బన్నీకి ఇచ్చాడు. నాకు త్రివిక్రమ్ డైలాగుల్లో ఇది బాగా ఇష్టం.
నేను, త్రివిక్రమ్ సరదాగా సాగిపోయే జెన్యూన్ సినిమా చేద్దామని అనుకున్నాం. నేడు దానికి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Reejlb
Comments
Post a Comment