Skip to main content

దిల్ రాజు మెడకు చుట్టుకున్న సరిలేరు, అల వైకుంఠపురములో విడుదల తేదీ వివాదం

dil raju negotiations with sarileru neekevvaru and ala vaikunthapuramulo makers
dil raju negotiations with sarileru neekevvaru and ala vaikunthapuramulo makers

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల తేదీ విషయంలో రాద్ధాంతం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు మొదట జనవరి 12న విడుదల చేద్దామని భావించడం, తర్వాత సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందుకు రావడం వంటి విషయాల తర్వాత అన్నీ సద్దుమణిగాయి అని భావించారు. అయితే రిలీజ్ డేట్ కు మరో పది రోజులు ఉందనగా ఈ రెండు చిత్రాలు రిలీజ్ డేట్ ల విషయంలో మళ్ళీ మొదటికి వచ్చాయి.

అల వైకుంఠపురములో 12న విడుదల నుండి ముందుకు వచ్చి 10 లేదా 11న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో సరిలేరు నిర్మాతలు కూడా అల వైకుంఠపురములో బట్టి తమ రిలీజ్ డేట్ ను ప్లాన్ చేసుకుందామని భావిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ల జగడం ఇప్పుడు దిల్ రాజు మెడకు చుట్టుకుంది. ఎందుకంటే ఈ రెండు సినిమాల నైజాం, వైజాగ్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజు వద్దే ఉన్నాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 33 కోట్లు పెట్టుబడి పెట్టిన దిల్ రాజు, అల వైకుంఠపురములో విషయంలో 26 కోట్లు పెట్టుబడి పెట్టాడు.

ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ ల విషయంలో గొడవ, దిల్ రాజు 59 కోట్ల పెట్టుబడికి ఎసరు పెట్టేలా ఉంది. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం వల్ల రెండూ సినిమాలకూ చేటు జరుగుతుంది. అందుకే దిల్ రాజు ఇప్పుడు రంగంలోకి దిగి ఇరు నిర్మాతలతో చర్చలకు దిగినట్లు తెలుస్తోంది. మొన్నటి నుండి ఇవి నడుస్తుండగా ఏ విషయం తేలలేదు. అయితే ఈరోజు ఫైనల్ గా మరోసారి దిల్ రాజు సమక్షంలో నిర్మాతల మీటింగ్ ఉండనుందని, ఈరోజుతో ఏ డేట్ అనేది క్లారిటీ రానుందని సమాచారం.

ఏదేమైనా ఈ మీటింగ్ వల్ల రెండు భారీ చిత్రాలకు మంచే జరుగుతుందని కోరుకుందాం. ఎందుకంటే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలపై దాదాపు 220 కోట్ల బిజినెస్ నడుస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SXNxjH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...