ఒక నటిగా విజయశాంతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నటనతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. గత కొంతకాలంగా రాజకీయాలలో బిజీగా గడుపుతున్న ఆమె తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” సినిమా ద్వారా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆమెకు ఎంతో గుర్తింపు ఇచ్చిన కర్తవ్యం సినిమాలో పాత్ర “భారతి” పేరునే, సరిలేరు.. సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెకు పెట్టారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్, దర్శకుడు అనిల్ & విజయశాంతి లతో ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూ విడుదల చెయ్యగా, అందులో విజయశాంతి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. తనను అనిల్ “రాజా ది గ్రేట్” సినిమా లో హీరో తల్లి పాత్రకు సంప్రదించారని, ఆ కథ, తన క్యారెక్టర్ నచ్చినప్పటికీ, బిజీగా ఉండటం వల్ల చెయ్యలేకపోయానని, ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమాలో మంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో హ్యాపీగా ఉందని తెలియచేసారు.
మహేష్ బాబు షూటింగ్ సమయంలో తనను ఎంతో బాగా చూసుకున్నారని, మహేష్ తో తాను “కొడుకు దిద్దిన కాపురం” సినిమా జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నామని వెల్లడించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rIEAzg
Comments
Post a Comment