సంక్రాంతి వచ్చిందటే ఎం.ఎస్. రాజు సినిమా వుండాల్సిందే. అలా సంక్రాంతి చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు ఎం.ఎస్.రాజు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటున్న ఆయన నూతన సంవత్సం సంర్భంగా చేసిన ట్వీట్ టాలీవుడ్‌తో పాటు సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నాను. చూసి షాకవ్వకండి` అని ట్వీట్ చేశారు.
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తున్న ఆయన ఇలా షాకింగ్ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నట్టుగానే షాకింగ్ అప్‌డేట్‌తో ముందుకొచ్చారు. `వాన` చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన మళ్లీ మెగా ఫోన్ పడుతూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. కొత్త నిర్మాతలు గూడూరు సతీష్‌బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `డర్టీహరి` అనే పేరుని ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని శనివారం రిలీజ్ చేశారు.
న్యూఏజ్ రోమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా శ్రావణ్‌రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. టైటిల్ డర్టీగా వున్నా సినిమా మాత్రం యూత్‌కి కనెక్ట్ అయ్యేలా వుంటుందని తెలుస్తోంది. హీరో బాత్ టబ్బులో పడుకుని హీరోయిన్ కాలి వేళ్ల మధ్యలో వున్న సిగరెట్‌ని కాలుస్తున్న స్టిల్ సినిమా ఏ స్థాయిలో వుండబోతోందనే సంకేతాల్నిఅందిస్తోంది. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి అంటున్నారు సినీ జనం.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FlIFN0
Comments
Post a Comment