వరుస సినిమాలతో దగ్గుబాటి హీరో రానా బిజీగా వున్నారు. ఆయన నటిస్తున్న హథీ మేరే సాథీ చిత్రీకరణ దశలో వుంది. 1992 నేపథ్యంలో వస్తున్న `విరాటపర్వం` చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఉత్తర తెలంగాణలోని 1992లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల రూపొందిస్తున్నారు.
సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరికి ఈ చిత్ర షూటింగ్‌ని పూర్తి చేయబోతున్నారు. `హిరణ్య కశ్యప`కు సిద్ధం కాబోతున్న రానా తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిసింది. `నేనే రాజు నేనే మంత్రి` చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు తేజ మళ్లీ రానానే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. రానాని కొత్తగా ఆవిష్కరించిన తేజ మరో సారి కొత్త కథతో ఆయనని సంప్రదించారట.
కథ కొత్తగా వుండటంతో రానా వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది. స్క్రిప్ట్‌కి తుదిమెరుగులు దిద్దుతున్నారట. అంతా ఓకే అయ్యాక ఎప్పుడు మొదలెడతారు? ఎవరు నిర్మిస్తారు వంటి వివరాలు వెల్లడిస్తారట. ఇక ఈ చిత్రానికి `రాక్షస రాజ్యంలో రావణాసురుడు` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఫైనల్ చేయబోతున్నట్టు తెలిసింది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2GdsbHp
Comments
Post a Comment