ఎం.జి.రామచంద్రన్.. ఇది పేరు కాదు తమిళనాడులో ఒక బ్రాండ్. మక్కల్ తిలకం అని కొంతమంది మాధ్యారే అని కొంతమంది తమ ఇంటి మనిషిగా ఆయన ఎల్లప్పుడూ తలుచుకుంటారు. తమిళనాట సంస్కృతికి ప్రతీకగా మొదలైన ద్రావిడ ఉద్యమం ఆ తర్వాత పక్కదారి పట్టి, అధికారమే లక్ష్యంగా కొనసాగిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.జి.రామచంద్రన్ తీసుకువచ్చిన సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను అంతగా ఆకర్షించాయి. ఆ తర్వాతి కాలంలో కూడా తమిళనాట ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎం.జి.రామచంద్రన్ పరిపాలనను ఆదర్శంగా తీసుకున్నారు వారిలో జయలలిత కూడా ఉన్నారు.
ఇక ప్రస్తుతం దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న అనే తలైవి సినిమాలో అతి కీలకమైన ఎం.జి.రామచంద్రన్ పాత్రను తమిళ నటుడు అరవిందస్వామి పోషిస్తున్నారు. ఇక చిత్ర యూనిట్ తాజాగా అరవిందస్వామి ఎం.జి.రామచంద్రన్ గారి గెటప్ లో ఉన్న ఫోటోను విడుదల చేశారు. ఎం.జి.రామచంద్రన్ అనగానే ప్రజలకు గుర్తొచ్చేది ఆయన అందమైన ముఖమే. నిండు చందమామలా చెదరని చిరునవ్వుతో ప్రజలను ఎల్లప్పుడూ పలకరించే ఎం.జి.రామచంద్రన్ ను ప్రజలు అలాగే గుర్తు పెట్టుకున్నారు. ఇక నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో ఒదిగి పోయినట్లుగా తెలుస్తోంది.
సినిమాకు సంబంధించి జయలలిత గారి సినిమా రాజకీయ మరియు వ్యక్తిగత జీవితంలో ఎం.జి.రామచంద్రన్ గారి పాత్ర ఎంతో ఉంది. మొదట్లో ఎం.జి.రామచంద్రన్ ను దేవునితో సమానంగా భావించిన జయలలిత తర్వాత చిన్న చిన్న గొడవలతో ఆయనకు దూరమైన తర్వాత చివరి వరకూ ఎం.జి.రామచంద్రన్ తోనే తన ప్రయాణాన్ని సాగించారు. ఎం.జి.రామచంద్రన్ కూడా తన వ్యక్తిగత జీవితంలో మరియు పార్టీలో కూడా జయలలితకు అంతే పెద్ద స్థానాన్ని ఇచ్చేవారు. ఇక ఎం.జి.రామచంద్రన్ కోసమే శోభన్ బాబుతో తన సాన్నిహిత్యాన్ని జయలలిత వదులుకున్నారని కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి.
ఏది ఏమైనా మన తెలుగులో లాగా కాకుండా తమిళనాడు లో ఎవరు బయోపిక్ తీసిన ఎం.జి.రామచంద్రన్ జయలలిత కరుణానిధి గురించి వ్యతిరేకంగా చూపించే ధైర్యం చేయరు ఎందుకంటే అక్కడ వాళ్ళ కున్నటువంటి అభిమానులు అలాంటి వాళ్ళు. ఇక ఈ సినిమాలో మరొక ముఖ్యమంత్రి కరుణానిధి గారి పాత్ర లో ఇప్పటికే ఇద్దరు సినిమాలో కరుణానిధి పాత్ర చేసిన ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు తలైవి సినిమాకు ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ఈ సంవత్సరం జూలైలో విడుదల కాబోతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/30uRH4a
Comments
Post a Comment