హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి `అవతార్` పదేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి త్వరలో వరుసగా సీక్వెల్స్ రాబోతున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టిన ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు కామెరాన్ సరికొత్త ప్రపంచాన్నిపరిచయం చేశారు. యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఈ చిత్రానికి కొనసాగింపుగా అవతార్ 2, అవతార్ 3, అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5 చిత్రాలు రాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో అవతార్ సరికొత్త ప్రపంచానికి సంబంధించిన చిత్రాలని చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కోసం విడుదల చేసింది. సీక్వెల్స్‌లో రాబోతున్న 2, 3 భాగాల్లోని కథ మొత్తం సముద్రపు పరివాహక ప్రాంతాల్లోనే జరగనుందట. అత్యధిక భాగం సముద్రపు నీటిలో చిత్రీకరించే సన్నివేశాల కోసం చిత్ర నటీనటులు ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట.
అవతార్ 2, అవతార్ 3ల్లో మీరు పండోరా గ్రహాన్ని చూడలేరు. అయితే వీటిల్లో మీరు సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు. రాబోయే అవతార్ వరల్ట్ కాన్సెప్ట్ ఫొటోలు మీకోసం` అని అతావర్ చిత్ర బృందం ట్వీట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం నిర్మాణ దశలో వున్న అవతార్ 2, అవతార్ 3 చిత్రాలు వరుసగా డిసెంబర్ 18 2021, డిసెంబర్ 22 2023న రిలీజ్ కాబోతున్నాయి. వీటిని బట్టే అవతార్ 4, అవతార్ 5 విడుదల చేస్తారట.
In the #Avatar sequels, you won’t just return to Pandora — you’ll explore new parts of the world.
Check out these brand new concept art pieces for a sneak peek at what’s to come. pic.twitter.com/bfZPWVa7XZ
— Avatar (@officialavatar) January 7, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T50aJt
Comments
Post a Comment