టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ డ్యాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నతాజా చిత్రం `ఫైటర్` ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని అంతా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఈ సోమవారం ముంబైలో ఈ చిత్రాన్ని చిత్రం బృందం లాంఛనంగా ప్రారంభించింది. మూర్తపు సన్నివేశంగా చిత్రీకరించిన సన్నివేశానికి హీరో విజయ్ దేవరకొండపై చార్మి క్లాప్ నిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోల్ని చార్మి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా అభిమనులతో పంచుకున్నారు.
ధర్మా ప్రొడక్షన్స్ సమర్పణలో పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌లపై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్‌జోహర్, అపూర్వమెహతా, చార్మితో కలిసి పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్టాయిలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ కారణంగానే బాలీవుడ్ నిర్మాత కరణ్‌జోహర్‌తో పూరా అసోసియేట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న 10వ చిత్రమిది. భారీ ప్రత్యేకతలతో తెరపైకి రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ ఫైటర్‌గా కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం కోసం థాయ్‌లాండ్‌లో 15 మంది మార్షల్ ఆర్ట్స్ నిపుణుల వద్ద మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించే అవకాశం వుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విసయం తెలిసిందే ఆమె కోసం ఈ చిత్రాన్ని మముంబైలో ప్రారంభించారట. ఇదిలా వుంటే జాన్వీ అంగీకరించకపోతే ఆ స్థానంలో అనన్య పాండేని తీసుకోవాలని పూరి భావిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం నుంచి స్పష్టత రావాల్సి వుంది.
To new beginnings
Shoot begins in mumbai from today@TheDeverakonda @purijagan @karanjohar @PuriConnects @DharmaMovies #VD10 #PJ37 #PCfilm #PanIndia
pic.twitter.com/BSEJxt0R1e
— Charmme Kaur (@Charmmeofficial) January 20, 2020
Credit: Twitter
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/30MSEFj


Comments
Post a Comment