Skip to main content

దర్బార్ మూవీ రివ్యూ

దర్బార్ మూవీ రివ్యూ
దర్బార్ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: దర్బార్
నటీనటులు: రజినీకాంత్, నయనతార, సునీల్ శెట్టి..
నిర్మాత: ఎన్వీ ప్రసాద్ అండ్ లైకా ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ మ్యూజిక్: అనిరుధ్
ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్
విడుదల తేదీ: జనవరి 09, 2020

సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. దర్బార్ ఈరోజే భారీ ఎత్తున విడుదలైంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ అంచనాలతో విడుదలైంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కథ:
ఆదిత్య అరుణాచలం (రజినీకాంత్) ఒక వింత పోలీస్ ఆఫీసర్. ఎవరైనా తప్పు చేస్తే చంపడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతుంటాడు. అసలు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆదిత్య ఇలా ఒక మ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా మారడం వెనుక కారణమెవరు? ఆదిత్య ఎవరికోసం వెతుకుతాడు. ముంబై కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి డ్రగ్ మాఫియాను అంతం చేయాలనుకున్న ఆదిత్య అరుణాచలంకు ఎదురైన సవాళ్లేంటి? కోల్పోయినదేంటి? ఈ ప్రశ్నలకు జవాబులు సినిమాలోనే దొరుకుతాయి.

నటీనటులు:
రజినీకాంత్ పెర్ఫార్మన్స్ గురించి చెప్పేదేముంది. ఎన్నో సినిమాలుగా మనల్ని అలరిస్తూ వస్తోన్న రజినీకాంత్ మరోసారి దుమ్ముదులిపే పెర్ఫార్మన్స్ తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో రజినీ స్టైల్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ నే కాక సామాన్య ప్రేక్షకులను కూడా కట్టి పడేస్తాయి. మ్యాడ్ కాప్ గా రజినీకాంత్ నటన చాలా బాగుంది. ఇక డ్యాన్సుల్లో, ఫైట్స్ లో కూడా చాలా యాక్టివ్ గా కనిపించాడు. చూడటానికి కూడా రజినీ చాలా యంగ్ గా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఇదే రజినీ బెస్ట్ లుక్.

నయనతార చూడటానికి బాగుంది. అయితే ఆమెకు పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉండే పాత్ర దక్కలేదు. నివేద థామస్ కు చాలా మంచి పాత్ర పడింది. రజినీ తర్వాత గుర్తుండిపోయే పాత్ర ఈమెదే. స్వతహాగా మంచి నటి అవ్వడం వల్ల ఎమోషనల్ సీన్స్ లో కూడా మెప్పించింది. విలన్ గా సునీల్ శెట్టి మెప్పించాడు. ప్రతీక్ బబ్బర్ కూడా పర్వాలేదు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ లో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కనపడుతుంది. ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. మూవీ యూనిట్ ఏది అడిగితె అది కాదనకుండా నిర్మాతలు డబ్బు ఖర్చుపెట్టినట్టున్నారు. అనిరుద్ అందించిన పాటలు యావరేజ్ గా ఉన్నాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా మెప్పించాడు. ముఖ్యంగా ఎలివేషన్ కోసం వాడుకున్న ర్యాప్ భలేగా వర్కౌట్ అయింది. కథ చాలా సినిమాల్లో చూసిన సాధారణ రివెంజ్ డ్రామానే. అయితే మురుగదాస్ దీనికి తనదైన శైలి కథనాన్నిజోడించాడు. కొన్ని సీన్స్ లో మురుగదాస్ ప్రతిభ కనపడుతుంది. ముఖ్యంగా అజయ్ మల్హోత్రాను బయటకు రాబట్టే సన్నివేశం మురుగదాస్ చమక్కుల్లో ఒకటి. ఇలాంటివి మరిన్ని పడి ఉంటే బాగుండేది.

విశ్లేషణ:
రజినీకాంత్ సినిమా అనగానే అందరూ తన మార్క్ మ్యానరిజమ్స్ పై దృష్టి పెట్టి అసలు కథను విస్మరిస్తున్నారు. దర్బార్ విషయంలో కూడా దాదాపుగా ఇలాంటి ప్రమాదమే జరిగింది. చాలా సాధారణ కథను చెప్పే ప్రయత్నం చేసాడు మురుగదాస్. తన సినీమాల్లో ఎప్పుడూ చెప్పే ఏదొక కొత్త పాయింట్ ను ఇందులో పూర్తిగా వదిలేసాడు. డ్రగ్స్, విమెన్ ట్రాఫికింగ్ తో పెద్ద సమస్యనే ఎత్తుకున్నా.. తర్వాత దాన్ని వదిలేసి పర్సనల్ రివెంజ్ వైపు వెళ్ళిపోయాడు. అయితే అవకాశం ఉన్న చోటల్లా రజినీ మార్క్ ఎలివేషన్స్ ను సరైన స్థాయిలో వాడుకోవడంతో దర్బార్ గ్రాఫ్ పడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ పూర్తి రేసిగా ఉండగా, సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పే చోట నెమ్మదిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పెద్దగా మెప్పించవు. అయితే మళ్ళీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో సినిమాను పైకి లేపి ముగించాడు మురుగదాస్.

చివరిగా: ఫ్యాన్స్ కు పండగే, మిగిలిన వారికి రోటీనే.

రేటింగ్: 3/5



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2tIH7Km

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...