గురువారం ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర మనస్థాపానికి గురైన హీరో యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజశేఖర్ `మా` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. గత కొంత కాలంగా నరేష్ అధ్యక్షుడిగా ఏర్పాటైన `మా` కార్య వర్గంలో ఎన్నికైన తోలి రోజు నుంచే లుక లుకలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలా వానగా మారి నటీనటుల్లో వున్న విభేధాల్ని మీడయా ముఖంగా బయటపెట్టాయి.
`మా` అధ్యక్షుడిగా నరేష్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే సభ్యుల మధ్య నెలకొన్న లుక లుకలు బయటపడ్డాయి. తన ప్యానల్ సభ్యులంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన అకధ్యక్షుడు నరేష్ మీడియా ముఖంగా హేమని మాట్లాడనీయకుండా మైకు లాక్కోవడం అప్పట్లో రచ్చకు దారిలీసింది. ఆ తరువాత కూడా నరేష్ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, మమ్మల్ని సంప్రదించడం లేదని సభ్యులు మీడియా ముఖంగా విమర్శలు గుప్పించారు.
అధ్యక్షుడు లేకుండా సర్వసభ్య సమావేశాన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. రాజశేఖర్, జీవిత నిర్వహించడంతో `మా` గొడవలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇప్పడంటే ఇప్పుడే తనని రాజీనామా చేయమంటే చేసేస్తానని నరేష్ ప్రకటించడంతో చిరంజీవి రంగంలోకి దిగారని అంతటా ప్రచారం జరిగింది. `మా`లో గొడవలు సద్దుమణిగాయని అనుకుంటున్న వేళ ఈ గురువారం `మా` డైరీ ఆవిష్కరణ సాక్షగా మళ్లీ బయటపడ్డాయి. దీంతో వేదిక సాక్షిగా చిరంజీవి హీరో రాజశేఖర్‌ని మందలించడంతో ఆయన మనస్థాపానికి గురై ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై డా. రాజశేఖర్ ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35eLp9G
Comments
Post a Comment