స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఈ రెండు చిత్రాలకి ఎంత ప్రయత్నిస్తున్నా స్నేహపూర్వక పోటీ అన్నదే కుదరట్లేదు. సాధారణంగా సంక్రాంతి సినిమాలకు చాలా కాంపిటీషన్ ఉంటుంది. అందులోనూ రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయంటే ఆ హంగామానే వేరు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు వస్తున్నాయంటే ట్రేడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే రిలీజ్ డేట్ ల విషయంలో జరిగిన కన్ఫ్యూజన్ అనాలో, మరొకటి అనాలో కానీ మొదటినుండి కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ముందుగా అల వైకుంఠపురములో టీమ్ జనవరి 12న తమ సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆ తర్వాత సరిగ్గా గంట వ్యవధిలో సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా అదే రోజున సినిమా రిలీజ్ అని ప్రకటించారు. దీంతో ట్రేడ్ తో ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రావడమేంటని అందరూ కంగారు పడ్డారు. అందుకే నిర్మాతల గిల్డ్ కలుగజేసుకుని జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యేలా ఒప్పించారు. దీంతో కథ సుఖంతమైందని ఊపిరి పీల్చుకున్నారంతా. జనవరి 11న సరిలేరు, జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రాలతో ఈ సంక్రాంతి హంగామా మాములుగా ఉండదని అంతా ఆశించారు. అయితే లేటుగా ఈ రిలీజ్ డేట్ ల విషయంలో మరో ట్విస్ట్ వచ్చింది. ఒకరోజు ముందు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలైతే ఆ చిత్రానికి అడ్వాంటేజ్ పెరిగిపోతుంది కాబట్టి అల వైకుంఠపురములో టీమ్ బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా లెక్క చేయకుండా సరిలేరు నీకెవ్వరు కంటే ఒకరోజు ముందు అంటే జనవరి 10న తమ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలతో మహేష్ వర్గాల్లో ఒకింత ఆందోళన నెలకొంది. వాళ్ళు 10న వస్తే తమ సినిమా కూడా అదే రోజు వచ్చేలా చూడాలని మహేష్ చెప్పినట్లుగా ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇందులో నిజమెంతో వారికే తెలియాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qh23RQ
Comments
Post a Comment