Skip to main content

“V”లో రక్షకుడు వచ్చేసాడు!

Sudheer Babu look from V revealed
Sudheer Babu look from V revealed

తన కెరీర్ లో ఇన్నాళ్లూ సాఫ్ట్ సినిమాలే చేస్తూ వచ్చిన టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈసారి సరికొత్త టేకింగ్ తో మన ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. V అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు నటిస్తున్నారు. నాని తొలిసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటిస్తోన్న చిత్రమిదే. మోహన్ కృష్ణ దర్శకత్వంలోనే వచ్చిన జెంటిల్ మ్యాన్ లో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసినా తర్వాత అది మంచి పాత్రే అని తేలిపోతుంది. అయితే ఈసారి నాని రాక్షసుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. రాక్షసుడు ఉన్నప్పుడు రక్షకుడు కూడా ఉండాలిగా. అప్పుడేగా బ్యాలెన్సింగ్ అవుతుంది.

రక్షకుడి పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈరోజు V లో రక్షకుడిగా నటిస్తోన్న సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు. సుధీర్ బాబు లుక్ ఈ చిత్రంలో అదిరిపోయిందని చెప్పాలి. గన్ పట్టుకుని టెరిఫిక్ గా ఉన్న సుధీర్ బాబు లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. “తప్పు జరిగితే యముడొస్తాడనేది నమ్మకం.. వీడొస్తాడనేది మాత్రం నిజం”.. సుధీర్ బాబు క్యారెక్టర్ ను డిఫైన్ చేయగలిగే లైన్ తో ఫస్ట్ లుక్ ను రివీల్ చేసారు.

రేపు రాక్షసుడుగా నటిస్తోన్న నాని లుక్ ను రివీల్ చేయబోతున్నారు. దానిపై ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి దాన్ని V టీమ్ ఎలా ప్రెజంట్ చేస్తుందనేది చూడాలి. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చ్ 25న విడుదల కానుంది. ఇటీవలే షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అదితి రావు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. V టైటిల్ లో కూడా ఎంతో సస్పెన్స్ ఉంది. దాన్ని మాత్రం తెరపై చూసే తెలుసుకోవాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O27YZv

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...