స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 18 నెలల విరామం తరువాత `అల వైకుంఠపురములో` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా వసూళ్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది. ఎంతో కాలంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న బన్నీ కల ఈ సినిమాతో తీరిపోయింది. గీతా ఆర్ట్స్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్‌లు వచ్చాయి. అందులో తన సినిమా లేదని ఫీలైన బన్నీకి ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని అందించింది.
`అల వైకుంఠపురములో` చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న డన్నీ ఇప్పడు సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న బన్నీ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి బ్లాక్ ఖాదీ కుర్తాలో పోజ్ ఇచ్చిన ఫొటోలు ఫ్యాన్స్‌ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో అల్లు దంపతుల్ని చూసిన ఫ్యాన్స్ అంతా బ్లాక్ డ్రెస్‌లో అల్లు జోడీ కేకో కేక అంటున్నారు. ఈ డ్రెస్‌ని అబు జైన్ సందీప్ ఖోస్లా డిజైప్ చేశారు. ఈ ఫొటోల్ని ఇంద్రనీల్ రాథోఢ్ తన కెమెరాలో బంధించారు.
అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. చిత్తూరు స్లాంగ్‌ని ప్రాక్టీస్ చేస్తున్న బన్నీ ఈ సినిమా కోసం తనని తాను పూర్తి మార్చి కొత్తగా కనిపించడానికి కసరత్తులు చేస్తున్నారు. భారీ జులపాలతో, గుబురు గడ్డం, మెలితిరిగిన మీసంతో ఈ చిత్రంలో ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఫిబ్రవరి నుంచి తాజా షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36s9c6E
Comments
Post a Comment