Skip to main content

ఆర్‌.ఎక్స్.100` కార్తికేయ హీరోగా `హిప్పీ`

RX100 Karthikeya new movie HIPPI`ఆర్‌.ఎక్స్.100`…… చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌ల‌నం. ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన చిత్రం. తొలి చిత్రంతోనే యూత్ ఐకాన్ అనే గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కార్తికేయ‌. మూవీ ల‌వ‌ర్స్ కీ, సినీ గోయ‌ర్స్ కీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు క‌లైపులి.య‌స్‌.థాను. అభిరుచి గ‌ల, భారీ బ‌డ్జెట్‌ నిర్మాత‌గా ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మైన స్థానం. తెలుగువారికి ఎంతో ప‌రిచ‌యమున్న `కాక్క కాక్క‌`, `కంద‌సామి`, `తుపాకి`, `అరిమా నంబి`, `క‌నిద‌న్‌`, `తెరి`, `క‌బాలి`, `వేలై ఇల్లా ప‌ట్ట‌దారి2`, `స్కెచ్‌`.. ఇవ‌న్నీ ఆయ‌న నిర్మించిన చిత్రాలే. 1985 నుంచి సినిమా నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసుకుని నిర్మాత‌గా, ప్ర‌ముఖ పంపిణీదారుడిగా త‌మిళ‌నాట కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ హీరోగా ఆయ‌న ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి క్రియేష‌న్స్ , ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . కార్తికేయ హీరోగా న‌టిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు.ఆ సినిమాకు `హిప్పీ` అనే టైటిల్ పెట్టారు. శుక్ర‌వారం కార్తికేయ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని `హిప్పీ` టైటిల్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రం గురించి…

ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.కృష్ణ మాట్లాడుతూ “రొమాంటిక్ కామెడీ చిత్ర‌మిది. కార్తికేయ త‌న తొలి చిత్రానికి భిన్నంగా క‌నిపిస్తారు. కేర్‌ఫ్రీ, కేజువ‌ల్‌గా సాగే పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తారు. చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్లుంటారు. వాళ్ల‌ని ఇంకా ఫైన‌ల్ చేయాలి. సినిమా ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే సినిమా. మ‌న జీవితంలో నిత్యం జ‌రిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుంది.’సిల్లును ఒరు కాదల్ ‘(`నువ్వునేను ప్రేమ‌`గా తెలుగులో అనువాదమైంది ), `నెడుంజాలై` , తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది“ అని అన్నారు.

నిర్మాత క‌లైపులి.య‌స్‌.థాను మాట్లాడుతూ “త‌మిళంలో 1985 నుంచి వ‌రుస‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నాం. అటు పంపిణీరంగంలోనూ మాదైన ముద్ర‌తో కొన‌సాగుతున్నాం. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్ప‌టికి కుదిరింది. కార్తికేయ `ఆర్‌.ఎక్స్.100` చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి త‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌న‌తో `హిప్పీ` అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఎక్క‌డా బ‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా, సినిమాకు కావాల్సిన‌దంతా స‌మ‌కూర్చి భారీగా రూపొందిస్తాం“ అని అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ “ఆర్ ఎక్స్ 100 త‌ర్వాత ఓ పెద్ద సంస్థ‌లో అవ‌కాశం రావ‌డం నా అదృష్టం. క‌థ చాలా బావుంది. నిత్యం మ‌న జీవితంలో జ‌రిగే అంశాల‌ను తెరపై చూడొచ్చు. తొలి సినిమా ఇచ్చిన స‌క్సెస్‌ను కంటిన్యూ చేసే సినిమా అవుతుంది“ అని అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2MPOVOi

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే!

దేవి ప్లేస్ లో థమన్.. అంతా ఉత్తిదే! ప్రస్తుతం థమన్ హాట్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. సినిమా ఏదైనా తన ఆల్బమ్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నాడు థమన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన పాటలు మాత్రం హిట్టైపోతున్నాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతల హాట్ ఫేవరెట్ థమన్ అనడంలో సందేహం లేదు. సరిగ్గా థమన్ ఫామ్ రైజ్ అవుతున్న సమయంలో దేవి శ్రీ ప్రసాద్ డౌన్ అవ్వడం గమనార్హం. దశాబ్ద కాలంగా టాప్ ఫామ్ లో కొనసాగిన దేవి శ్రీ ప్రసాద్ గత కొంత కాలంగా ఫామ్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. రీసెంట్ గా అతను కంపోజ్ చేసిన ఆల్బమ్స్ కూడా సూపర్ హిట్ అయిన దాఖలాలు తక్కువే. ఈ నేపథ్యంలో సుకుమార్ – అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను ఎంచుకోవడంతో కొత్త రూమర్స్ పుట్టుకొచ్చాయి. తనకు అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన థమన్ ను ఈ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అల్లు అర్జున్ పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో బన్నీ, సుకుమార్ ఇద్దరి మధ్యా వాదనలు కూడా జరిగినట్లు వార్తలు అల్లేశారు. హీరో మాట కోసం సుకుమార్ కూడా థమన్ నే తీసుకుందామన్న నిర్ణయానికి వచ్చినట్లు రూమర్లు షికార్లు చేసాయి. అయితే ఈ వార్...