ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్ , డ్యాన్స్ అంటేనే ఎన్టీఆర్ అలాంటిది తాజాగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో పాటలు ఉన్నాయి కానీ డ్యాన్స్ తో అదరగొట్టే మాస్ సాంగ్స్ మాత్రం లేవట! ఇప్పటికే రిలీజ్ అయిన ఒక పాట క్లాస్ గా ఉండగా మిగతా పాటలు కూడా అదే రీతిలో ఉంటాయట , దాంతో ఎన్టీఆర్ డ్యాన్స్ పెద్దగా ఉండదు కాబట్టి ఫాస్ట్ బీట్ ఉండదు కాబట్టి ఫాస్ట్ మూమెంట్స్ కూడా ఉండవు. అంటే నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే కదా ! ఇది. ఫాస్ట్ డ్యాన్స్ ఉంటే ఆ మజానే వేరు పైగా నందమూరి అభిమానులు కోరుకునేదే మాస్ డ్యాన్స్ అలాంటి డ్యాన్స్ ఉంటే థియేటర్లలో ఈలలే ఈలలు గోలలే గోలలు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , ఈషా రెబ్బా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది హైదరాబాద్ లో . మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి రిలీజ్ సమయం దగ్గర పడింది కాబట్టి.
English Title: Bad news for ntr fans
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Nm6z1y
Comments
Post a Comment