అర్ధరాత్రి బెడ్ రూంకు వచ్చి నడుము మీద చేయి వేసి రుద్దుతానని ఓ నటుడు అన్నాడని , అతడి మాటలకు షాక్ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆఫ్టే. ఇప్పటికే పలుమార్లు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ భామ ఓ సౌత్ స్టార్ హీరోపై కూడా సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది. సౌత్ హీరోపై ఆరోపణలు చేసినప్పటికీ అతడు ఎవరు ? అని మాత్రం ప్రకటించలేదు . అలాగే ఇప్పుడు కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించిన నటుడు ఎవరు అన్నది కూడా వెల్లడించలేదు.
షూటింగ్ లో పాల్గొన్న తర్వాత రాధికా ఆఫ్టే కు తీవ్రమైన నడుము నొప్పి వచ్చిందట దాంతో రెస్ట్ తీసుకోవడానికి హోటల్ గదిలోకి వెళ్తున్న సమయంలో లిఫ్ట్ లో రాధిక ఆప్టే తో పాటుగా ఓ నటుడు కూడా వచ్చాడట ! అంతేకాదు లిఫ్ట్ లోనే రాధికా ఆఫ్టే తో అమర్యాదగా మాట్లాడట. నడుం నొప్పి తగ్గాలంటే నాకు చెప్పండి అర్ధరాత్రి వస్తాను నడుము నొప్పి పోయేలా మర్దన చేస్తాను సమ్మగా ఉంటుంది అని ఓపెన్ గా అన్నాడట ! నేను ఆడ అతడు మగ అలాంటిది నన్ను ఎలా తాకుతాడు . అలా ఎలా మాట్లాడతాడు అంటూ కోపంగా అంటోంది రాధికా ఆఫ్టే. పొద్దున్నే యూనిట్ సబ్యులకు చెప్పడంతో వాళ్ళు చీవాట్లు పెట్టేసరికి సారీ చెప్పాడట ఆ నటుడు. ఈ సోధంతా చెబుతోంది కానీ ఆ నటుడు ఎవరు అన్నది మాత్రం చెప్పడం లేదు ఈ భామ .
English Title: Radhika apte shocked with actor
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Njjgde
Comments
Post a Comment