Skip to main content

వేర్ ఈజ్ వెంకటలక్ష్మి లోగో లాంచ్…

raai laxmi where is venkata lakshmi movie logo launchఎబిటి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెర‌కెక్కుతున్న చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్ర లోగోను ద‌ర్శ‌క నిర్మాత‌లు విడుద‌ల చేసారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ అంతా పాల్గొంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ సార‌థీ స్టూడియోస్ లో జ‌రుగుతుంది. ఇక్క‌డే ప్ర‌త్యేకంగా ఓ సెట్ వేసి.. ల‌క్ష్మీరాయ్ పై పాపా నీకు ఏదంటే ఇష్టం అనే పాట‌ను చిత్రీక‌రించారు. సురేష్ భ‌నిశెట్టి రాసిన ఈ పాట‌ను శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేసారు. ఈ సినిమాలో పాట ప్ర‌త్యేకంగా నిలుస్తుందంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ సంద‌ర్భంగా గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. “రెండు నెలల కింద షూటింగ్ మొద‌లుపెట్టి.. అమలాపురంలో 20 రోజులు షూటింగ్ చేసాము. పాట చిత్రీక‌ర‌ణ త‌ర్వాత 10రోజులు అమలాపురంలో షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తైతే షూట్ కూడా పూర్త‌వుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దీపావళి రోజున సినిమా విడుద‌ల చేస్తాం. ల‌క్ష్మీరాయ్ త‌నే హీరోగా ఈ సినిమాను న‌డిపిస్తుంది. పూజిత పాత్ర కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ద‌ర్శ‌కుడు కిషోర్ చాలా అద్బుతంగా తెర‌కెక్కిస్తున్నాడు. కామెడీ త్రిల్లర్ గా తెరకెక్కుతోంది.. ఖర్చుకు వెనకాడకుండా నా స్నేహితులు శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా” అవుతుందని అన్నారు.

హీరోయిన్ లక్ష్మీరాయ్ మాట్లాడుతూ… “ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ. పాపా నీకేదంటే ఇష్టం పాట‌ను శేఖ‌ర్ మాస్ట‌ర్ అద్భుతంగా కంపోజ్ చేస్తున్నారు. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు. దర్శకుడు కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన లక్ష్మీ రాయ్, మరియు నిర్మాతలకు నా కృతఙ్ఞతలు. సబ్జెక్ట్ చాలా బాగొచ్చింది. కామెడీ త్రిల్లర్. ప్రేక్షకులను బాగా నవ్వించాలని చేసిన ప్రయత్నమే ఈ వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ చిత్రం. అమలాపురంలో చిత్రీక‌ర‌ణ జరుపుకుంది. ప్రస్తుతం ఓ మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.. రింగా రింగా.., రత్తాలు పాటల‌ మాదిరే ఇది కూడా పాపుల‌ర్ అవుతుంది. సీనియ‌ర్ న‌టులు కావ‌డంతో అంతా బాగా న‌టిస్తున్నారు. ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. త్వరలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నానని” ల‌క్ష్మీరాయ్ చెప్పారు.

నిర్మాతల్లో ఒకరైన ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ… “ఇప్ప‌టికే 70 శాతం సినిమా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పాట‌ చిత్రీకరణలో ఉంది. ద‌ర్శ‌కుడు చాలా బాగా తెరకెక్కిస్తున్నాడు.. నటీనటులు అందరూ ఎంతో బాగా సహకరిస్తున్నారు… సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నామని” అన్నారు.

ల‌క్ష్మీరాయ్ తో పాటు ప‌లువురు సీనియ‌ర్ న‌టులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిల‌తో పాటు లక్ష్మీ రాయ్, హీరో రామ్ కార్తిక్, హీరోయిన్ పూజిత పొన్నాడ, పంకజ్, కిషోర్, మధుసూదన్, వెంకట్, శేఖర్ మాస్టర్, హరి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

న‌టీన‌టులు:
లక్ష్మీ రాయ్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, ప్రవీణ్, మధునందన్, అన్నపూర్ణమ్మ, పంకజ్ కిసారి తదితరులు

సాంకేతిక విభాగం:
ద‌ర్శ‌కుడు: కిషోర్ కుమార్(లడ్డా)
నిర్మాతలు: ఎమ్. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు: కిరణ్ తటవర్తి,
సంగీత ద‌ర్శ‌కుడు: హరి గురువ
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాకామూరి
ఎడిటర్: ఎస్ ఆర్. శేఖర్
ఆర్ట్: బ్రహ్మ కడలి
ఫైట్స్: రామ్ సుంకర
కొరియోగ్రఫీ: శేఖర్, యశ్వంత్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ppTFku

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...