మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలయ్యేందుకు సర్వం సిద్ధంగా ఉన్న విషయం తెల్సిందే. ఒకవైపు ప్రమోషన్స్ జోరు కూడా పెరిగింది. అయితే అక్టోబర్ 2న విడుదల కావాల్సిన సైరా సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. ఇంత త్వరగా రివ్యూ ఇచ్చింది ఎవరనుకుంటున్నారా?
కాస్త సోషల్ మీడియా పరిజ్ఞానం ఉండి సినిమాల మీద ఆసక్తి ఉన్నవాళ్లు ఎవరికైనా దుబాయ్ నుండి మొదటి రివ్యూ వస్తుందని తెలుసు. అక్కడ సెన్సార్ బోర్డు మెంబర్ ప్లస్ జర్నలిస్ట్ అయిన ఉమైర్ సంధు ప్రతీ భారతీయ సినిమాకి చాలా ముందుగానే తన రివ్యూ ఇస్తాడు. సాహో చిత్రానికి దాని రిలీజ్ కి ముందు సూపర్ హిట్ అని రివ్యూ ఇచ్చాడు, కాకపోతే అది తప్పయింది లెండి.
ఇలా ప్రతీ సినిమాకి తన అభిప్రాయాన్ని చెప్పే ఉమైర్ ఈసారి సైరాకి కూడా బ్లాక్ బస్టర్, స్పీచ్ లెస్ వంటి పదాలు వాడి తెగ పొగిడేసాడు. ఈ చిత్రానికి స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నానని అన్నాడు. సాహో విషయంలో ఈయన లెక్క తప్పినా ఎక్కువగా ఈయన చెప్పినట్లే సినిమా రిజల్ట్ ఉంటుంది. మరి సైరా విషయంలో కూడా అదే జరుగుతుందా?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2lGetWK
Comments
Post a Comment