కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న మీడియం బడ్జెట్ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమై చాలా త్వరగా టాప్ హీరోల రేంజ్ కి వెళ్ళింది. కెరీర్ మొదట్లో ఛలో, గీత గోవిందం, దేవదాస్ వంటి మీడియం బడ్జెట్ సినిమాల్లో చేసింది. ఇప్పుడు మహేష్ తో పాటు అల్లు అర్జున్ – సుకుమార్ సినిమాలో కూడా రష్మిక సెలెక్ట్ అయింది. తమిళంలో కూడా పలు ఆఫర్లు అందుకునేలా ఉంది.
ఇదంతా పక్కనపెడితే మహేష్ సినిమాలో రష్మిక రోల్ డమ్మీనేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సరిలేరు నీకవ్వరు అనేది పక్కా కమర్షియల్ సినిమా. ఇది మహేష్ సెంట్రిక్ గా ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.రష్మిక మొదటినుండి గ్లామరస్ హీరోయిన్ కాదు. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుంది. అందుకే గ్లామర్ రిలీఫ్ కోసం స్పెషల్ సాంగ్ లో తమన్నాను తీసుకున్నారు. మరో పాట కోసం పూజ హెగ్డే ను కూడా అనుకుంటున్నారట.
ఇక ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ ఉన్నారంటే రష్మిక రోల్ డమ్మీనేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎంత పెద్ద సినిమాలో అయినా డమ్మీ రోల్ అయితే ఒరిగేదేముంటుందన్న ప్రశ్న సినీ ప్రేక్షకులకు కలుగుతోంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nQIi7V
Comments
Post a Comment