వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. అయితే రిజల్ట్ పాజిటివ్ గానే వచ్చిందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఒకవైపు గద్దలకొండ గణేష్ టీమ్ విజయయాత్రలు సైతం చేసుకుంటున్నాయి. తొలి వారం కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మనం వింటూనే ఉంటాం.
ఇంకేంటి అడ్డు గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ అనడానికి అనుకుంటున్నారా? నిజానికి ఈ చిత్రానికి తొలి వారాంతం మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం అగ్నిపరీక్ష కూడా విజయవంతంగా దాటింది. మంగళవారం కలెక్షన్స్ ఇంకొంచెం తగ్గినా పర్వాలేదు. బుధ, గురువారాల్లో కలెక్షన్స్ మరింతగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి.
రోజురోజుకీ కలెక్షన్స్ తగ్గుతుండడంతో ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోని ఈ చిత్రాన్ని సూపర్ హిట్ అని ఎలా అనగలం. పైగా మరో 5 రోజుల్లో సైరా దిగిపోతుంది. కచ్చితంగా గద్దలకొండ గణేష్ బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంది. ఒక్క ఓవర్సీస్, మరొక రెండు, మూడు చోట్ల తప్ప ఈ చిత్రం వల్ల బయ్యర్లు నష్టపోరు, అలా అని చెప్పి లాభాలనూ వెనకేసుకోరు. జస్ట్ బ్రేక్ ఈవెన్ దాటి ఆగిపోనుంది గద్దలకొండ గణేష్.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2m2b7Ob
Comments
Post a Comment