Skip to main content

అక్కడ సైరాకు మరింత ఇబ్బంది

Sye Raa Narasimha Reddy
Sye Raa Narasimha Reddy

సాహో సినిమాకు లభించిన అదృష్టం, ఆ చిత్రం విడుదలకు అన్ని భాషలలో వేరే సినిమాలు రిలీజ్ లు లేకుండా అందరూ ఓపెన్ హ్యాండ్ ఇచ్చారు. ఇది ఆ చిత్రానికి బాగా ఉపయోగపడింది. టాక్ బ్యాడ్ గా వచ్చినా సాహో ఓపెనింగ్స్ కుమ్మేసిందంటే దానికి కారణం ఈ ఓపెన్ గ్రౌండ్ అని చెప్పవచ్చు.

అయితే ఇదే ఓపెన్ నెస్ చిరంజీవి సైరాకు లభించట్లేదు. తెలుగులో కూడా గోపీచంద్ చాణక్యతో రిలీజ్ కి సిద్ధమవుతున్నాడు. ఇక హిందీలో అయితే హృతిక్, టైగర్ కలిసిన నటించిన వార్ విడుదలవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం కాబట్టి వార్ అక్కడ భారీ ఎత్తున రిలీజవుతోంది. ఇది సరిపోన్నట్లు హాలీవుడ్ చిత్రం జోకర్ అక్టోబర్ 4న విడుదల కావాల్సి ఉండగా దానిని అక్టోబర్ 2కి మార్చారు.

మల్టిప్లెక్స్ ఆడియన్స్ కు జోకర్ పై భారీ అంచనాలున్నాయి. మల్టీప్లెక్స్ లలో వార్, జోకర్ ఎక్కువ స్క్రీన్లు లాక్ చేసుకోవడం సైరాకు ఇబ్బందిగా మారింది. సింగల్ స్క్రీన్లు ఎక్కువగా సైరాకే లభించినా రెవిన్యూ ఎక్కువ కనపడాలంటే మాత్రం మల్టీప్లెక్స్ లే దారి. మరి అక్టోబర్ 2న సైరా ఈ త్రిముఖ పోరులో ఎలా విజయం సాధిస్తుందో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2maRV0B

Comments