మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం గద్దలకొండ గణేష్ చిత్రానికి అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకోవడంతో కలెక్షన్స్ ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం 30 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటడం ఖాయం.
అయితే అన్ని చోట్లా బయ్యర్లకు లాభాలు ఇచ్చిన గద్దలకొండ గణేష్, యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం మొండి చేయి చూపించాడు. అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 600K డాలర్లు వసూలు చేయాలి. కానీ రిపోర్ట్స్ అందిన సమయానికి కేవలం 374K డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పటికే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అవ్వడంతో గద్దలకొండ గణేష్ అక్కడ లాస్ వెంచర్ గా మిగిలిపోనుంది.
ఈమధ్య యూఎస్ లో తెలుగు సినిమాలు బాగా నష్టపోతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలకు యూఎస్ మార్కెట్ బంగారు బాతులా ఉండేది. అయితే మితిమీరిన ఆశతో ఎక్కువ రేట్లకు అమ్మడం, కొనడం వంటి వాటి వల్ల యూఎస్ లో వరసగా తెలుగు సినిమాలకు నష్టాలే మిగులుతున్నాయి. మరి సైరాతోనైనా అక్కడ లాభాలు వస్తాయేమో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nzG6RQ
Comments
Post a Comment