ప్రతీ మనిషికీ తన జీవిత ప్రయాణంలో కొన్ని కోరికలుంటాయి. అవి నెరవేర్చుకునే క్రమంలో తన ప్రయాణాన్ని ఆ దిశగా కొనసాగిస్తుంటాడు. కానీ ప్రతీ కోరికా తీరాలని కూడా లేదుగా. ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కూడా ఒక తీరని కోరికతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ విషయం తల్చుకుని బాధపడుతున్నారు వేణు మాధవ్ శ్రేయోభిలాషులు.
వేణు మాధవ్ సినిమాల్లోకి రాక ముందు టీడీపీ ఆఫీస్ లో పనిచేసేవాడు. అప్పటినుండే వేణుకి రాజకీయాల్లో రాణించాలని కోరిక బలంగా ఉండేది. మొదటినుండి టీడీపీకి పనిచేసిన వేణుమాధవ్ 2014లో తన సొంత నియోజకవర్గం కోదాడ నుండి పోటీ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పుడు ఆయన ఆశలు తీరలేదు.
2018 ముందస్తు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని విశ్వప్రయత్నాలు చేసారు. అయితే ఈ దఫా నామినేషన్ పత్రాలు సరిగ్గా దాఖలు చేయలేదని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఇక ఆ కోరిక తీరకుండానే మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఈరోజు కన్నుమూశారు వేణుమాధవ్. రాజకీయాల్లో రాణించలేకపోయినా సినిమాల్లో ఆయన పాత్రలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2l0uZR2
Comments
Post a Comment