అంచనాలకు అతీతంగా సాగే రియాలిటీ షోలో నిన్న ఆసక్తికర పరిణామం జరిగింది. మొదటి నుండి హౌస్ మేట్స్ లో స్ట్రాంగ్ అనిపించుకుంటున్న సీరియల్ నటుడు రవికృష్ణ నిన్న షో నుండి ఎలిమినేట్ కావడమే దానికి కారణం. గత వారం అందరూ బలమైన వాళ్లే ఎలిమినేషన్ కు నామినేట్ కావడం దీనికి అతిపెద్ద కారణం. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ నామినేట్ అయ్యారు. వీళ్ళందరూ బలమైన వారే. బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వారే.
ఇక నిన్న రవికృష్ణ వెళ్లిపోవడంతో ఈ ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వడానికి ఫెవరేట్స్ గా పరిగణిస్తున్నారు. వీరిలో కూడా బాబా భాస్కర్ కు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తెలుగు సరిగ్గా రాకపోవడం, టాస్క్ లను సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం, ఇంట్లోంచి వెళ్లిపోవాలన్న కోరికను ఇప్పటికే బయటపెట్టడం, రీసెంట్ గా తన మీద వచ్చిన నెగటివ్ ఇంప్రెషన్.. ఇవన్నీ బాబా భాస్కర్ కు నెగటివ్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకనే వరుణ్, శ్రీముఖిలలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్ అయ్యే అవకాశాలున్నాయి.
ఇక బిగ్ బాస్ లో ఐదు వారాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఇంకా తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక నుండి బిగ్ బాస్ మరింత రసవత్తరంగా ఉండనుంది. మరి ఏరోజు ఏం జరుగుతుందో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mlfK64
Comments
Post a Comment