Skip to main content

శ్రీముఖి దర్శకత్వంలో బిగ్ బాస్ నడుస్తోందా?

SriMukhi
శ్రీముఖి దర్శకత్వంలో బిగ్ బాస్ నడుస్తోందా?

సాధారణంగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తోటి వారి మీద విమర్శలు చేయడం చాలా సహజం. కానీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే హిమజ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి బిగ్ బాస్ కొంతమందికి ఫేవర్ గా నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఎవర్ని చూపిస్తే తమకు రేటింగ్స్ బాగా వస్తాయి, ఎవర్ని చూపిస్తే రావు వంటి లెక్కలు వేసుకుని షోలో వారికే ఎక్కువ ఫుటేజ్ ఉండేలా చూసుకుంటాడు అని చెప్పింది హిమజ.

అంతటితో ఆగకుండా శ్రీముఖికి బిగ్ బాస్ లో పని చేసే ఇద్దరు అభిషేక్, శ్యామ్ అని ఇద్దరు బాగా క్లోజ్ అని, తాను ఏం చెప్పాలనుకున్నా కెమెరాల ద్వారా వారికి ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చేదని, టాస్క్స్ జరుగుతున్నప్పుడు కెమెరా ముందుకెళ్లి అవసరమైతే మరో రీటేక్ చేద్దామని కూడా చెప్పిందని హిమజ అంది.

రియాలిటీ షోస్ లోనే టాప్ అని పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ వంటి షోలో నిజంగానే రీటేక్ లు ఉంటాయా అన్న సందేహాలు ఇప్పుడు ప్రేక్షకులకు కలుగుతున్నాయి. ఇటీవలే ఎలిమినేట్ అయిన అలీ రెజాను, శ్రీముఖికి సపోర్ట్ ఇవ్వడానికే బిగ్ బాస్ హౌజ్ లోకి పంపారని ఇప్పుడు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ బిగ్ బాస్ కు చేటు చేసేవే? మరి వీటిలో నిజమెంతుందో వారికే తెలియాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mbM630

Comments