రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్ర షూటింగ్ నత్తనడకన సాగుతోంది. పెర్ఫెక్షన్ కు మారుపేరైన రాజమౌళి నెమ్మదిగా ఈ చిత్రాన్ని చెక్కుతున్నాడు. దానికి తోడు చరణ్, ఎన్టీఆర్ కు ఒకరితర్వాత ఒకరికి గాయాలవ్వడం కూడా షూటింగ్ డిలేకు కారణమైంది. మధ్య ఎన్టీఆర్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన హాలీవుడ్ భామ వెళ్లిపోవడం, ఆ పాత్ర కోసం వేరొకరి ఎంపిక వల్ల జరిగిన ఆలస్యం.. ఇలా ఏదీ అనుకున్న ప్లాన్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ విషయంలో జరగట్లేదు.
నిజానికి సినిమా ప్రారంభమైనప్పుడే ఈ చిత్రం జులై 30, 2020న విడుదలవుతుంది అని చెప్పాడు రాజమౌళి. దాని ప్రకారమే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. దాని ప్రకారం జనవరికల్లా షూటింగ్ మొత్తం పూర్తైపోవాలి. సాలిడ్ గా నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కావాలి.
కానీ ఇప్పుడు షూటింగ్ పూర్తయ్యేసరికే మార్చ్ లేదా ఏప్రిల్ అయ్యేలా ఉంది. దాని తర్వాత మూడు లేదా నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి వదిలితే జులైకి సినిమా తీసుకురావడం అసాధ్యం. మరోవైపు రాజమౌళి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని వ్యక్తి. సినిమా లేట్ అయినా పర్లేదు, అనుకున్నది అనుకున్నట్లు రావాలని కోరుకుంటాడు. అందుకే ఆర్ ఆర్ ఆర్ వెనక్కి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారంతా.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2lkOuns
Comments
Post a Comment