నాని నటించిన నిన్ను కోరి చిత్రంలోని ‘అడిగా అడిగా’ పాట ద్వారా సిద్ శ్రీరామ్ గురించి తెలుగు శ్రోతలకు తెల్సింది. ఆ వెంటనే ‘ఇంకేం ఇంకేం కావాలె’, అందం అమ్మాయైతే’, ‘మాటే వినదుగా’ వంటి పాటలతో యూత్ లో సెన్సేషన్ అయిపోయాడు. అయితే సిద్ శ్రీరామ్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడినా కానీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు మాత్రం పాడలేదు.
కారణాలు ఏవైనా కానీ, తన పాటలకు యూట్యూబ్ లో కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నా సిద్ శ్రీరామ్ ను స్టార్ హీరోలు పట్టించుకోలేదు. సంగీత దర్శకులలో కూడా థమన్, దేవిశ్రీ ప్రసాద్ వంటి వారు సిద్ తో పాడించకపోవడంతో స్టార్ హీరోలకు పాడలేకపోయి ఉండవచ్చు. అయితే ఎట్టకేలకు సిద్, అల్లు అర్జున్ సినిమాకు పాట పాడి టాప్ హీరోలకు పాడడం మొదలుపెట్టాడు. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ‘సామజవరగమన’ పాట ఈరోజే విడుదలైంది.
ఈ పాట మెలోడియస్ గా ఉంటూ శ్రోతలకు ఇన్స్టంట్ గా ఎక్కేస్తోంది. సిద్ శ్రీరామ్ కు ఉండే పెక్యూలియర్ గొంతు కూడా పెద్ద ప్లస్ అయిందనే చెప్పవచ్చు. అల వైకుంఠపురములో నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజైన ఈ పాట సూపర్ హిట్ అవ్వడం ఖాయం. మరి దీంతోనైనా సిద్ శ్రీరామ్ ను టాప్ హీరోలు, సంగీత దర్శకులు కన్సిడర్ చేస్తారేమో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2lTzUUs
Comments
Post a Comment