Skip to main content

అఖిల్ కి అనుకోకుండా సహాయం చేసిన ప్రభాస్

Prabhas And Akhil
అఖిల్ కి అనుకోకుండా సహాయం చేసిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. నార్త్ లో తప్పించి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న చిత్రం ఫెయిల్ అవ్వడంతో ప్రభాస్ ఇప్పుడు తన తర్వాతి సినిమా జాన్ చిత్రాన్ని మరోసారి సమీక్షించి మార్పులు కోరాడట.

రాధాకృష్ణ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని బ్రేక్ తీసుకుంది. సాహో విడుదలైన నేపథ్యంలో సెప్టెంబర్ మధ్యనుండి ఈ చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలవ్వాలి కానీ ప్రభాస్ కోరిన మార్పులు షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి వాయిదా పడింది. ఇప్పుడు ఈ వాయిదా అఖిల్ కి ఉపయోగపడుతోంది. అదెలాగంటే..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేస్తోన్న చిత్రంలో పూజ హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. ఇటీవలే పూజ మంచి ఫామ్ లో ఉండడంతో తను ఎంత పారితోషికం డిమాండ్ చేసినా కాదనకుండా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ తన దగ్గర ఇవ్వడానికి డేట్స్ లేవు. ఇప్పుడు ప్రభాస్ సినిమా వాయిదా పడడంతో ఆ డేట్స్ అఖిల్ సినిమాకి ఇచ్చిందన్నమాట. అలా అఖిల్ కి ప్రభాస్ అనుకోకుండా హెల్ప్ చేసాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2nJENzT

Comments