మెగా హీరో అల్లు శిరీష్ ఇప్పటిదాకా చేసిన సినిమాలతో తెచ్చుకున్న గుర్తింపు సున్నా అని చెప్పవచ్చు. ఒక్క శ్రీరస్తు శుభమస్తు తప్పితే తన కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేదు. ఆ సినిమా కూడా దర్శకుడి ప్రతిభ వల్ల ఆడిందే ఎక్కువ. అల్లు శిరీష్ లాస్ట్ సినిమా ABCD పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు కానీ దాని వల్ల మరో ప్లాప్ ఎదురైంది.
ABCD పరాజయంతో అల్లు శిరీష్ పూర్తిగా డల్ అయిపోయాడు. ఇప్పటిదాకా మరో సినిమా మొదలుపెట్టింది లేదు. కనీసం నెక్స్ట్ సినిమా ఇంతవరకూ అనౌన్స్ చేయలేదు. ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ కొత్త దర్శకుడితో ఒక లవ్ స్టోరీ ఉంటుందని, వివరాలు వారంలో వెల్లడిస్తాడని అన్నాడు కానీ ఇంతవరకూ దాని ఊసే ఎత్తలేదు.
మిగతా మెగా హీరోలు డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో దూసుకెళ్తుంటే అల్లు శిరీష్ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది పరిస్థితి. అందుకే ఈసారి గ్యాప్ ఎక్కువైనా పర్లేదు పక్కా స్క్రిప్ట్ తోనే రావాలని డిసైడ్ అయిపోయాడు. అందుకనే ఈ లేట్. మరి ఈసారైనా అల్లు శిరీష్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mzb4JS
Comments
Post a Comment