ఈరోజుల్లో ఏ చిత్రమైన సింహభాగం కలెక్షన్స్ తొలి వారాంతంలోనే తెచ్చుకుంటోంది. ఎలాంటి చిత్రానికైనా తొలి వారాంతం దాటగానే కలెక్షన్స్ డ్రాప్ భారీగా అవుతోంది. అయితే వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం తొలి వారాంతంలో అదరగొట్టింది. 25 కోట్లు బిజినెస్ చేసిన ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే 16 కోట్లు వరకూ రాబట్టేసింది.
సోమ, మంగళవారాల్లో వసూళ్లు కొంచెం తగ్గినా స్టడీగానే ఉన్నాయి. కానీ గత రెండు రోజులుగా నైజాంలో అందునా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలు గద్దలకొండ గణేష్ చిత్ర కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పనిదినాల్లో సినిమా హాళ్లకు ఫస్ట్ షో, సెకండ్ షో టైమ్ లోనే జనాలు థియేటర్లకు వస్తారు.
సరిగ్గా అదే సమయంలో వరుణుడు దంచి కొడుతుండడంతో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కు చేరుకోవాల్సిన ఈ చిత్రం ఇంకా ఎదురీదుతోంది. అక్టోబర్ 2 సైరా వచ్చి దాదాపు థియేటర్లు అన్నీ ఆక్రమించుకుంటుంది కాబట్టి ఏం వచ్చినా ఈలోపే రావాలి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2mdhJsR
Comments
Post a Comment