బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో అందరికంటే గేమ్ బాగా ఆడుతున్నాడని పేరు తెచ్చుకున్న వ్యక్తి అలీ రెజా. అటు ఫీజికల్ టాస్క్ లలో, ఇటు మెంటల్ టాస్క్ లలో కూడా అలీ అందరికంటే ముందుండేవాడు. అందుకే అలీ కచ్చితంగా ఫైనల్స్ కు వెళ్తాడని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ లో ఉండే హౌజ్ మేట్స్ కూడా బలంగా నమ్మారు.
ఒకరకంగా బిగ్ బాస్ నుండి అలీ ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ నుండి అలీ వచ్చేసిన తర్వాత సోషల్ మీడియాలో అలీ రెజాను మళ్ళీ బిగ్ బాస్ లోకి పంపాలంటూ ప్రేక్షకులు కోరారు. గతేడాది నూతన్ నాయుడు, శ్యామల రీ ఎంట్రీ ఇచ్చినట్లుగానే అలీని మళ్ళీ హౌజ్ లోకి పంపాలని డిమాండ్స్ పెరిగాయి.
అయితే అలీ ఎలిమినేట్ అయ్యి మూడు వారాలు కావొస్తోంది. ఇప్పటిదాకా దీనిపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఇక ఉండదనే అనుకున్నారంతా. కానీ ఇటీవలే ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఈ వారం అలీ బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిపింది. స్టార్ మా నుండి అందిన విశ్వసనీయ సమాచారం అని పేర్కొంటూ, ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయిన తర్వాత ఆదివారం రాత్రి నాగార్జున అలీ తిరిగి బిగ్ బాస్ హౌజ్ లోకి పంపుతాడని అంటున్నారు. చూడాలి మరి ఇందులో ఎంతవరకూ నిజముందో.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2lDstAC
Comments
Post a Comment