
దర్శకుడిగా నరసింహారావుకు ఇది కొత్త సినిమా కానీ కథకుడిగా మాత్రం కాదు ఎందుకంటే తమిళ బ్లాక్ బస్టర్ కత్తి సినిమాకు కథ అనధికారికంగా అందించింది ఈ నరసింహారావే ! నిర్మాతలు కొత్త వాళ్ళు అయినప్పటికీ నరసింహారావు చెప్పిన కథ నచ్చి భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చారు. కట్ చేస్తే రేపు ప్రపంచ వ్యాప్తంగా శరభ చిత్రం విడుదల అవుతోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నారు ఆ చిత్ర బృందం. చిన్న చిత్రంగా వచ్చే సినిమాలు భారీ విజయాలు సాధించిన చిత్రాలు కోకొల్లలు . వాటి లాగే శరభ హిట్ కావాలని , అవుతుందని ఆశిస్తున్నారు శరభ బృందం. అయితే 20 కోట్లు వసూల్ చేసి దుమ్ము లేపుతుందా ? లేదా ? అన్నది రేపు తేలిపోనుంది.
English Title: Sarabha unit hopes on succes
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zjVLb0
Comments
Post a Comment