Skip to main content

సందీప్ కిష‌న్ నిర్మాత‌గా `నిను వీడ‌ని నీడ‌ను నేనే` టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

Sundeep Kishan-produced 'Ninu Veedani Needanu Nene' title, First Look releaseతెలుగు, త‌మిళంలో వైవిధ్య‌మైన సినిమాల్లో క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న హీరో సందీప్ కిష‌న్‌. ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు నిర్మాత‌గా మారారు. సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం సంయుక్తంగా స్థాపించిన నిర్మాణ సంస్థ వెంక‌టాద్రి టాకీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా సందీప్ కిష‌న్‌, అన్య సింగ్ హీరో హీరోయిన్‌గా కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాత‌లుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`. ఈ సినిమా ర‌షెష్‌ను చూసిన విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యం అయ్యారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా….

ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ – “సూప‌ర్ నేచుర‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. వైవిధ్య‌మైన సినిమాలు చేసిన హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న తొలి సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల‌ర్ ఇది. సందీప్ కిష‌న్‌ను మ‌రో కొత్త పాత్ర‌లో చూస్తారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే చిత్రమ‌వుతుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

నిర్మాత ద‌యా ప‌న్నెం మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడు కార్తీక్ చెప్పిన కథ చాలా బావుంది. సూప‌ర్ నేచుర‌ల్ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. మ‌రో ఆరో రోజుల షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. మా సినిమా ర‌షెష్ చూసి `గూఢ‌చారి` వంటి హిట్ చిత్రాన్ని విడుద‌ల చేసిన విస్తా మ‌ర్చంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యం వ‌హించారు. అలాగే ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర‌గారు ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా విస్తా మ‌ర్చంట్స్‌, అనీల్ సుంక‌ర‌గారికి థాంక్స్‌“ అన్నారు.

సందీప్ కిష‌న్ స్నేహితుడు శివా చెర్రీ.. మేనేజ‌ర్ సీతారాం ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

న‌టీన‌టులు:

సందీప్ కిష‌న్‌
అన్య సింగ్
పోసాని కృష్ణ ముర‌ళి
ముర‌ళీ శ‌ర్మ‌
వెన్నెల‌కిషోర్‌
రాహుల్ రామ‌కృష్ణ‌
పూర్ణిమ భాగ్య‌రాజ్‌
ప్ర‌గ‌తి

సాంకేతిక నిపుణులు:

నిర్మాత‌లు: ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ రాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: శివా చెర్రీ, సీతారాం, కిరుబాక‌ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌మోద్ వ‌ర్మ‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌
ఆర్ట్‌: విదేశ్‌
పి.ఆర్‌.ఒ: నాయుడు – ఫ‌ణి(బియాండ్ మీడియా)



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TCqJUq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...