Skip to main content

డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌కు సిద్ద‌మైన సుబ్రహ్మణ్య‌పురం

Subramanyapuram movie get release dateవైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పై బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు
సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం . సుబ్రహ్మణ్య‌పురం. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికెట్ తో డిసెంబర్ 7న అత్య‌ధిక థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సైన్స్ కి అంద‌ని ఎన్నో ర‌హాస్యాలు మాన‌వ మేథ‌స్సుకు స‌వాళ్ళు విసురుతూనే ఉంటాయి. భ‌గ‌వంతుని మీద న‌మ్మ‌కం కూడా అలాంటిదే, ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌శ్నించే కార్తిక్ ప‌రిశోధ‌న‌లు ఎలాంటి నిజాల‌ను వెలుగులోకి తెచ్చాయి..? కాపాడ‌వ‌ల్సిన భ‌గ‌వంతుడి ఆగ్ర‌హం త‌ట్టుకోవ‌డం సాధ్యం అవుతుందా అనే ప్ర‌శ్న‌లు కు స‌మాధానం ఈ నెల 7న దొర‌క‌బోతుంది. విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న ల‌భించింది. ఒక‌రోజులో 1మిలియ‌న్ వ్యూస్ ని సాధించిన సుబ్ర‌మ‌ణ్య‌పురం ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ కి అభినంద‌న‌లు తెలిపింది. థ్రిల్ల‌ర్స్ లోసుబ్రహ్మణ్య‌పురం ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంటుద‌ని అంటుంది చిత్ర యూనిట్. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రహ్మణ్య‌పురం’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం ’ కు వర్క్ చేసారు. బాల సుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 7న బ్ర‌హ్మండ‌మైన విడుద‌ల‌కు
సిద్దం అవుత‌న్నసుబ్రహ్మణ్య‌పురం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతుల‌ను అందిస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్త ప‌రిచింది చిత్ర యూనిట్.

 

హీరో: స‌మంత్,
హీరోయిన్ః ఈషారెబ్బ‌
ప్ర‌ధాన తారాగ‌ణంః సురేష్, సాయికుమార్, ఆలి, స‌త్య సాయి శ్రీనివాస్,
మిర్చి మాధ‌వి, సుర్య‌, ర‌ఘునాథ్ రెడ్డి, సారిక రామ‌చంద్ర‌రావు, జోష్
ర‌వి, బ‌ద్రం, గిరిధ‌ర్, అమిత్ శ‌ర్మ‌, టి.ఎన్.ఆర్.

 

సాంకేతిక వ‌ర్గంః

సినిమాటోగ్ర‌ఫిః ఆర్.కె. ప్రతాప్
ఎడిట‌ర్ః కార్తిక్ శ్రీనివాస్
సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌
క్యాస్టూమ్ డిజైన‌ర్ః సుమ త్రిపుర‌ణ‌
ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
పి.ఆర్.ఓః జియ‌స్ కె మీడియా
కో డైరెక్ట‌ర్ః ఆర్.సురేష్
ప్రొడ్యూస‌ర్ ః బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి
రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ః సంతోష్ జాగ‌ర్లపూడి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AjaO4l

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...