అజ్ఞాతవాసి చిత్రంతో ఘోర పరాజయంని అందుకున్నాడు పవన్ కల్యాణ్ దాంతో మరో సినిమా చేయాలని భావించినప్పటికీ కుదరలేదు దాంతో ఇక పవన్ కల్యాణ్ మరో సినిమా ఇప్పట్లో చేసే అవకాశం లేనట్లే అని అనుకున్నారు కట్ చేస్తే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు 2019 మేలో జరుగనున్నాయి దాంతో ఆలోపు సినిమాని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట.
అయితే ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశం లేదు. కేవలం గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే ఇవ్వనున్నాడు. ఓ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తాడు కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఓ 45 నిమిషాల క్యారెక్టర్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని నిర్మించేది నేల టికెట్ నిర్మాత రామ్ తాళ్ళూరి కాగా డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు డాలీ దర్శకత్వంలో పవన్ రెండు చిత్రాల్లో నటించాడు.
English Title: Pawan kalyan next movie with political back drop
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PGru08
Comments
Post a Comment