టచ్ చేసి చూడు అన్నాడు జనాలు వద్దు బాబోయ్ మేం టచ్ చేయం అంటూ పారిపోయారు ,నేలటిక్కేట్ అన్నాడు …….. నేలలో కూర్చొని సినిమా చూసే రోజులు పోయాయి అంటూ నేలకేసి కొట్టారు రవితేజ నేల టిక్కెట్ చిత్రాన్ని దాంతో కొంత గ్యాప్ తెసుకొని అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ శ్రీను వైట్ల తో కలిసి వస్తున్నాడు రవితేజ . శ్రీను వైట్ల కు కూడా ఇది జీవన్మరణ సమస్యలా మారింది . తప్పనిసరిగా హిట్ కొట్టాలి లేకపోతే మళ్ళీ డైరెక్షన్ చాన్స్ అంటూ ఎవ్వరూ ఇవ్వరు అంతలా దిగజారి పోయింది శ్రీను వైట్ల పరిస్థితి . రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన దుబాయ్ శీను , వెంకీ , నీకోసం చిత్రాలు హిట్ అయ్యాయి దాంతో తప్పకుండా అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావంతో ఉన్నారు ఇద్దరు కూడా .
రవితేజ సరసన గోవా ముద్దుగుమ్మ ఇలియానా నటించగా పలువురు కమెడియన్ లు ఈ చిత్రంలో నటించారు . సినిమా మొత్తం ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుందని , దానికి తోడూ యాక్షన్ కూడా ఉంటుందని తప్పకుండా మంచి హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ చిత్ర బృందం . హిట్ అయితే ఫరవాలేదు ఇద్దరికీ మంచిది . హిట్ కాకపోతేనే శ్రీను వైట్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారౌతుంది . ఇక రవితేజ కు కూడా ఈ సినిమా తప్పనిసరిగా హిట్ కావాలి .
English Title: Will Raviteja gets success with Amar Akbar Antony
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qo80tv
Comments
Post a Comment