Skip to main content

పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో శ్రీకృష్ణ క్రియేష‌న్స్ కొత్త చిత్రం ప్రారంభం!!

Shree Krishna Creation Production No1 Movie Openningశ్రీకృష్ణ క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడక్ష‌న్ నెం-1గా పూర్ణ ప్ర‌ధాన‌ పాత్ర‌లో గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వం బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగింది. ఈ చిత్రం ద్వారా అన్నం చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్ర‌ముఖ మాట‌ల ర‌చ‌యిత మ‌రుధూరి రాజా ముహూర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా నిర్మాత ఫాద‌ర్ ఇ.రమేష్ కెమెరా స్విచాన్ చేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ…“నేను తెలుగులో ప‌లు చిత్రాల‌ను రిలీజ్ చేశాను. తొలిసారిగా నిర్మాత‌గా మారి ఈ సినిమా నిర్మిస్తున్నా. మా ద‌ర్శ‌కుడు చెప్పిన కాన్సెప్ట్ న‌చ్చి పూర్ణ గారైతే ప‌ర్ఫెక్ట్ యాప్ట్ అని ఆమెను తీసుకున్నాం. అలాగే ఎన్నోసినిమాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన బాల్ రెడ్డిగారు , పెప్పీ సాంగ్స్ తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను ఏర్ప‌రుచుకున్న భీమ్స్ సిసిరోలియో గారు మా సినిమాకు వ‌ర్క్ చేస్తున్నారు. ఇలా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ‌కుండా టాలెంటెడ్ టెక్నిషీయ‌న్స్ తో సినిమా నిర్మిస్తున్నాం. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చే సి…స‌మ్మ‌ర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ద‌ర్శ‌కుడు అన్నం చిన్నికృష్ణ మాట్లాడుతూ…“డైర‌క్ట‌ర్ గా ఇది నా తొలి సినిమా. మా నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండ్ గా సినిమా చేయ‌డానికి అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్నారు. ప‌ర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్ర కావ‌డంతో పూర్ణ గారిని తీసుకున్నాం. లైన్ చెప్ప‌గానే వెంట‌నే ఓకే చేశారు. బాల్ రెడ్డి, భీమ్స్ సిసిరోలియో గారిలాంటి మంచి టెక్నిషీయన్స్ ని మా నిర్మాత ఇచ్చారు. క‌చ్చితంగా ఒక మంచి సినిమా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాం అన్న ధీమాతో ఉన్నాం“ అన్నారు.

న‌టి పూర్ణ మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు, నిర్మాత ఇద్ద‌రూ ఎంతో అభిరుచి ఉన్న వ్య‌క్తులు. సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తోన్న త‌రుణంలో ఈ క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఇందులో నా క్యార‌క్ట‌ర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది“ అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ…“ పూర్ణ గారు హీరోయిన్ గా న‌టించిన సీమ‌ట‌పాకాయ్ చిత్రంలో నేనొక పాట రాశాను. అదే పూర్ణ‌గారు మెయిన్ లీడ్ లో న‌టిస్తోన్న చిత్రానికి మ్యూజిక్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా విష‌యానికొస్తే ద‌ర్శ‌కుడు క్లారిటీతో ఉన్నారు. పాట‌లకు మంచి సంద‌ర్భాలు ఇస్తున్నారు. నిర్మాత కూడా మ్యూజిక్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీగా రావ‌డానికి స‌హ‌క‌రిస్తున్నారు“ అన్నారు.

పూర్ణ మెయిన్ లీడ్ లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ః బాల్ రెడ్డి; స‌ంగీతంః భీమ్స్ సిసిరోలియో; స్టోరి డైలాగ్స్ః ముద్దు కృష్ణ; పిఆర్ఓః వంగాల కుమార‌స్వామి; నిర్మాతః గౌరికృష్ణ‌; ద‌ర్శ‌క‌త్వంః అన్నం చిన్నికృష్ణ‌.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FByzKZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...