
దర్శకుడు యన్. నరసింహారావు మాట్లాడుతూ…ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో దర్శకత్వశాఖలో పనిచేసాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. సోషియో ఫాంటసీ జోనర్ లో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఎమోషన్ తో పాటు సీజీ,గ్రాఫిక్స్ వున్నా సీన్స్ అన్నీ ప్రేక్షకులకు నచ్చుతాయి. తొలి చిత్రమే గొప్ప ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. కథని నమ్మి మా నిర్మాత అశ్వనీ కుమార్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు… అన్నారు.
హీరో అక్ష కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో లెజండరీ యాక్టర్స్ తో పనిచేసినందుకు చాలా హ్యాపీగా వుంది. శరభ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. దర్శకుడు నరసింహా రావు ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా నాకు మంచి ఎక్స్ పీరియన్స్ నిచ్చింది.. అన్నారు.
సీనియర్ హీరోయిన్ డాక్టర్ జయప్రద మాట్లాడుతూ… నా మొదటి చిత్రం రిలీజ్ అవుతుంటే ఎంత నెర్వస్ గా ఫీలయ్యానో మళ్ళీ ఇప్పుడు ఈ శరభ సినిమా కూడా అంత నెర్వస్ నెస్ గా అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్ కి దర్శకుడు జీవం పోసాడు. సినిమాలో మంచి ఫీల్ ఉంటుంది. నా సెకండ్ ఇన్నింగ్స్ లో శరభ లాంటి అద్భుతమైన సినిమాతో రావడం నాకు గర్వంగా వుంది. ఈ చిత్రంలో మదర్ క్యారెక్టర్ లో నటించాను. రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తాను. మ్యూజికల్ గా కూడా ఈ చిత్రం చాలా బాగుంటుంది. టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమాకి పనిచేసారు. తప్పకుండా ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BoCIOd
Comments
Post a Comment