Skip to main content

భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ ప్రారంభం

Young Tiger NTR, Mega Powerstar Ram Charan’s Massive Multistarrer with Ace Director SS Rajamouli launchedయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో.. బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సినిమా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించ‌గానే సినిమా ప్రారంభం కాక ముందు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా ఎప్పుడెప్పుడూ ప్రారంభం అవుతుందా అని మెగాభిమానులు, నంద‌మూరి అభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తుండ‌గా ఆరోజు రానే వ‌చ్చింది. ముందుగానే ప్ర‌క‌టించిన విధంగా న‌వంబ‌ర్ 11న సినీ ప్ర‌ముఖుల స‌మక్షంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా ఘ‌నంగా ప్రారంభ‌మైంది. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి భారీ బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తోఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ ప్రారంభోత్స‌వ‌ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రానా, క‌ల్యాణ్ రామ్‌, కొర‌టాల శివ‌, వంశీ పైడిప‌ల్లి, బోయపాటి శ్రీను, వెంకీ అట్లూరి, మెహ‌ర్ ర‌మేశ్, దిల్‌రాజు, అల్లు అర‌వింద్, పివిపి, శోభుయార్ల‌గ‌డ్డ‌, యు.వి వంశీ, యు.వి విక్ర‌మ్‌, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, కె.ఎల్‌.నారాయ‌ణ‌, డి.సురేశ్ బాబు, ఎం.ఎల్‌.కుమార్ చౌద‌రి, న‌వీన్ ఎర్నేని, సి.వి.మోహ‌న్‌, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, సాయికొర్రపాటి, గుణ్ణం గంగ‌రాజు త‌దిత‌రులు ముఖ్య‌ అతిథులుగా విచ్చేశారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా వి.వి.వినాయ‌క్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్క్రిప్ట్‌ను యూనిట్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా…
స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి మాట్లాడుతూ – “మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ టాలీవుడ్‌ను మా బ్యాన‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో.. తెలుగు సినిమా స‌త్తాను బాహుబ‌లితో ప్ర‌పంచానికి చాటిన ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళిగారి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం ఓ డ్రీమ్‌లాగా ఉంది. సినిమాపై ఇప్ప‌టి నుండే భారీ అంచ‌నాలున్నాయి. నంద‌మూరి అభిమానులు, మెగాభిమానులు సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా మేకింగ్‌లో కాంప్ర‌మైజ్ కాకుండా .. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్ర‌పంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువ‌ల‌తో సినిమాను భారీగా రూపొందిస్తాను. ఈ చిత్రాన్ని అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా చేయ‌బోయే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ నవంబ‌ర్ 19 నుండి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో భారీ సెట్‌లో రెండు వారాల పాటు ఈ యాక్ష‌న్ ఏపిసోడ్‌ను తెర‌కెక్కించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో చేయ‌బోయే మిగ‌తా న‌టీన‌టులు వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మాట‌లు: సాయిమాధ‌వ్ బుర్రా, క‌ర్కీ, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ర‌మా రాజ‌మౌళి. ఎడిట‌ర్‌: శ‌్రీక‌ర్ ప్ర‌సాద్‌, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ విజ‌న్‌: వి.శ్రీనివాస్ మోహ‌న్‌, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సాబు సిరిల్‌, సినిమాటోగ్ర‌ఫీ: కె.కె.సెంథిల్‌కుమార్‌, క‌థ‌: వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, నిర్మాత‌: డి.వి.వి.దాన‌య్య‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QH5lLC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...