Skip to main content

” క్రేజీ క్రేజీ ఫీలింగ్ ” టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్

crazy crazy feeling teaser responseవిజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా

దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్ లల్వాని హీరోయిన్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రం తెరకెక్కుతోంది . ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం . వెన్నెల కిశోర్ ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే లెంగ్తీ క్యారెక్టర్లో కడుపుబ్బ నవ్విస్తాడు. ఈ సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్ గా నిలిచారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా క్వాలిటీ సినిమా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించాం. టీజర్ కు వస్తున్న స్పందనతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అని అన్నారు.

నిర్మాత మధు మాట్లాడుతూ .. ప్రేమ , ఫీల్ , వినోదం ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా క్రేజీ క్రేజీ ఫీలింగ్ ని రూపొందిస్తున్నారు. టీజర్ కు చాలా మంచి స్పందన వస్తోంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. కథ బాగా నచ్చడంతో ఆయన చాలా సపోర్ట్ చేశారు. భీమ్స్ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి . త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నస్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
విష్వoత్ , పల్లక్ లల్వాని ,వెన్నెల కిశోర్ , ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ – విజ్ఞత ఫిలిమ్స్ పతాకం
సంగీతం – భీమ్స్ సిసిరోలియో,
సాహిత్యం – సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ ,
కెమెరా – సుభాష్ దొంతి ,
ఆర్ట్ – నాగు ,
కొరియోగ్రఫీ – రాజకిరణ్ , చార్లీ
పిఆర్వో – ఏలూరు శ్రీను
నిర్మాత – నూతలపాటి మధు
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – సంజయ్ కార్తీక్



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FwKmKq

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...