Skip to main content

అన్ని వ‌ర్గాల‌ను అల‌రించే సినిమా టాక్సీవాలా

taxiwaala movie press meetవిజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుని నవంబర్‌ 17న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా శుక్ర‌వారం జరిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

ద‌ర్శ‌కుడు రాహుల్ మాట్లాడుతూ… ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంది. రేపు మీ ముందుకు రాబోతుంది. నిన్న మా చిత్ర యూనిట్ మొత్తం ఈ సినిమాని చూశాం చాలా బావుంది. ఇది ఒక సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ మూవీ అన్ని వ‌ర్గాల‌ను అల‌రిస్తుంది. త‌ప్ప‌కుండా మీరందూ చూడండి. పైర‌సీ ప్రింట్ చూసిన వాళ్ళు కూడా మ‌ళ్ళీ సినిమాని చూడండి అని అన్నారు.

హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ మాట్లాడుతూ… మా డైరెక్ట‌ర్ రాహుల్ చెప్పిన‌ట్లు ఈ సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. నేను ఈ చిత్రంలో ఒక ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తున్నాను. అది మీరు థియేట‌ర్స్‌కి వెళ్ళి చూస్తేనే బావుంటుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా రేపు సినిమాని చూడండి అని అన్నారు.

హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ… ఈ చిత్రంలోని పాట‌లు ఎంత హిట్ అయ్యాయో సినిమా కూడా అదే విధంగా హిట్ అవుతుంది. మూవీ అంతా చాలా స‌ర‌దాగా ఉంటుంది. మీరంద‌రూ సినిమా మొద‌టి నుంచి చివ‌రి వ‌రకూ న‌వ్వుతూనే ఉంటారు. త‌ప్ప‌కుండా ఫ్యామిలీ అంతా క‌లిసి చూసే చిత్ర‌మిది. మిమ్మ‌ల్ని అంద‌ర్నీ అల‌రిస్తోంద‌ని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ ఎస్‌.కె.ఎన్ మాట్లాడుతూ… యువి.క్రియేషన్స్‌లో ఫ‌స్ట్ విడుద‌లైన భ‌లే భ‌లే మ‌గాడివోయి చిత్రం ఎంత‌గా హిట్ అయిందో, గీత ఆర్ట్స్ లోని గీత గోవిందం ఏ విధంగా విజ‌యాన్ని సాధించిందో ఈ చిత్రం కూడా అంతే విజ‌యాన్ని సాధిస్తుంది. ఇంత పెద్ద కాంబినేష‌న్‌లో హైఫై సూపర్ న్యాచ‌ర‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. మా డైరెక్ట‌ర్ రాహుల్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ తీసుకోని పాయింట్‌ని తీసుకుని తెర‌కెక్కించారు. సైన్స్ ఫిక్ష‌న్ కామెడీని తీసుకుని చాలా బాగా తీశారు. రాహుల్ పాయింట్ చెప్పిన‌వెంట‌నే నాకు, అర‌వింద్‌గారికి, బ‌న్నీగారికి బాగా న‌చ్చి ఓకే చేశాము. ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లో కాన్సెప్ట్ చిత్రాలు వ‌స్తున్నాయి. అదే విధంగా కాన్సెప్ట్ ప‌ర‌మైన మూవీ ఇది. విజ‌య‌దేవ‌ర‌కొండ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన చిత్రాల‌న్నీ డిఫ‌రెంట్ జోన‌ర్స్‌లోఉంటాయి. ఇది కూడా ఒక కొత్త జోన‌ర్ మీరంద‌రూ వీకెండ్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రియాంక కూడా ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాబోతుంది త‌న‌కు మీ టీమ్ అంద‌రి త‌ర‌పున ఆల్ ద బెస్ట్‌. అదే విధంగా మ‌రో హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ ఆల్రెడీ ఎక్స్‌పీరియ‌న్స్ హీరోయిన్ త‌న‌దికూడా ఈ చిత్రంలో చాలా మంచి క్యారెక్ట‌ర్‌. జేక్స్ బేజాయ్ మంచి మ్యూజిక్ అందించారు. అన్ని పాట‌లు చాలా పాపుల‌ర్ అయ్యాయి. రేపు హైద‌రాబాద్‌లో 126 షోస్ ప‌డుతున్నాయి. మొన్న పైర‌సీ చూసిన ప్ర‌తి ఒక‌ళ్ళు కూడా మ‌ళ్ళీ థియేట‌ర్‌కి వెళ్ళి సినిమాని చూడండి. ఒక పూర్తి సినిమా చూసిన అనుభ‌వం వ‌స్తుంది. అంద‌రూ ఫ్యామిలీతో వెళ్లి త‌ప్ప‌కుండా చూడండి. మీరు థియేట‌ర్స్‌కి వెళ్ళి చూసిన డ‌బ్బులు మాకు రావు. ఇందులో చాలా మంది ఉంటారు చాలా మందిక‌ష్టం ఉంటుంది. థియేట‌ర్ వాళ్ళు, ఎంతోమంది టెక్నీషియ‌న్ల క‌ష్టం ఉంటుంది అంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FrH1MH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...