టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు యంగ్ టాలెంట్ పుట్టుకొస్తూనే ఉంది . సినిమారంగం వారసుల రాజ్యం అయినప్పటికీ టాలెంట్ ఉంటే వారసత్వం తో అవసరం లేదని ఇప్పటికే పలుమార్లు పలువురు నటీనటులు చాటిచెప్పారు . అయితే టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ వెలుగులోకి వస్తున్నప్పటికీ అది ఖండాంతరాలను దాటి వచ్చిన దాఖలాలు అంతగా లేవు . కానీ మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కి ఎల్లలు లేవని ఖండాంతరవాసి అందునా ఓ చిన్నది చిన్నోడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు . ఇంతకీ ఎవరా ఖండాంతరవాసులు అనుకుంటున్నారా ? చంద్రహాస్ అలియాస్ బబ్బు . చంద్రహాస్ – శ్లోక అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నారు . మాస్ మహారాజ్ రవితేజ – ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ లో చంద్రహాస్ అలియాస్ బబ్బు నటించగా గోవా ముద్దుగుమ్మ ఇలియానా చిన్నప్పటి క్యారెక్టర్ లో శ్లోక నటించింది .
ఇంతకీ శ్లోక ఎవరో తెలుసా టాలీవుడ్ లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లయ కూతురు ఈ శ్లోక . శ్రీ గణేష్ గోర్టీ ని 2006 లో పెళ్ళి చేసుకుంది లయ . పెళ్ళికి ముందే సినిమాల్లో నటించడం మానేసింది . లయ – డాక్టర్ శ్రీ గణేష్ గోర్టీ కు ఇద్దరు సంతానం కాగా శ్లోక పెద్దమ్మాయి . ఇక మాస్ మహారాజ్ రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన చంద్రహాస్ కూడా లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నాడు . సురేంద్ర – లక్ష్మి మెరిసెర్ల దంపతుల కుమారుడు ఈ చంద్రహాస్ . నటన పట్ల మక్కువ ఎక్కువ చంద్రహాస్ కు దాంతో రవితేజ చిన్నప్పటికీ క్యారెక్టర్ పోషించే గోల్డెన్ చాన్స్ వచ్చింది . ఇంకేముంది తన సత్తా చూపించాడు ఈ బుడతడు . చంద్రహాస్ – శ్లోక ల నటనకు సెట్ లోని యూనిట్ వాళ్ళు ఫిదా అయ్యారంటే వాళ్ళు ఎంతటి టాలెంటో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు . పూర్తిగా అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో చంద్రహాస్ – శ్లోక లు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఈనెల 16 న విడుదల అవుతుండగా వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ బాగానే ఉంది . టాలీవుడ్ కి చంద్రహాస్ – శ్లోక ల లాగే మరింతమంది ఖండాంతరాలను దాటి రావాలని టాలెంట్ తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తోంది టాలీవుడ్ డాట్ నెట్ .

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PLMHVR
Comments
Post a Comment