Skip to main content

తనీష్ నటన ఒక రిఫరెన్స్ లా మిగులుతుంది- సిరివెన్నెల

Rangu Pre Release eventన‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న చిత్రం `రంగు`. కార్తికేయ‌.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు నిర్మాత‌లు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం
హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డాన్సర్స్ తో కలసి ఆడిపాడి హీరో, హీరోయిన్లు అతిథులను ఆనందింప చేసారు. ఈవెంట్ లో ‘రంగు’ సినిమా పాటలను
అతిథులతో లాంఛ్ చేయించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా అతిథులు, చిత్ర బృదం మాట్లాడుతూ…

రాజ్ కందుకూరి మాట్లాడుతూ: ‘‘ టైటిల్ నాకు బాగా నచ్చింది. సినిమా పాటలు, ట్రైలర్స్ చూస్తుంటే చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. తనీష్ నటన ఎంటో మనం చిన్నతనం నుండి చూస్తున్నాం. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.

పరుచూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ:
‘‘ఈ సినిమా నేను చూసాను, తనీష్ కనపడలేదు లారా నే కనపడ్డాడు. మా అబ్బాయి నటన కూడా బాగుంది. అలాగే మ్యూజిక్ దర్శకుడు యోగీశ్వర శర్మ కూడా చక్కని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమా. వందల సినిమాలకు కథ, మాటలు అందించాం. కార్తికేయ అందించిన కథ మాకు బాగా నచ్చింది. లారా కుటుంబ
సభ్యుల ఈ సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు. ప్రేక్షకులకు కూడా అదే భావన కలుగుతుందని నా నమ్మకం . లారా అనే వ్యక్తులు విజయవాడలోనే కాదు, ప్రతి ఊరిలోనూ కనపడతారు, అలాంటి యూనివర్సల్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు దర్శకుడు. తనీష్ నటన అద్భుతంగా ఉంది. మా చేతులు మీదుగా పెద్ద స్టార్ ని చేయాలని ఉంది. రంగు అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే మనుషులలో రకరకాల రంగులు ఉంటాయి. అవి అవసరాన్ని బట్టి బయటపడతాయి. ఈ సినిమా విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటుంది అని నా నమ్మకం’’ అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ:
‘‘ఈ ఈవెంట్ కి రావడానికి రావడానికి కారణం నిర్మాత పద్మనాభ రెడ్డి గారు. అనేక మందికి చేయూత నిచ్చి, తాను ఎదుగుతూ, పదిమందికి ఉపయోగపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీ లో తక్కువుగా ఉంటారు. చిన్న కథలకు ఆదరణ పెరుగుతుంది. కథ బాగుంటే సినిమాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కథ లేని సినిమాలను ఎన్ని హాంగులున్నా ప్రేక్షకులు తిప్పి కొడుతున్నారు. రంగు చాలా ఆరోగ్య కరమైన సినిమా. గాయం లో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని ’ అనే పాట రాసాను. అది నాకు చాలా తృప్తినిచ్చింది. చాలాకాలం తర్వాత ‘ఎక్కడ
ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పులేదు. ‘రంగు’ లో పాటలు బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటున్నారు. మా అబ్బాయికి మంచి పేరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా అబ్బాయిని పొగడటం నాకు ఇబ్బందిగా ఉంటుంది. పరుచూరి
వెంకటేశ్వరరావు కు నాకు, పుత్రోత్సాహం కలిగించింది దర్శకుడు కార్తికేయ కు ఉన్న పట్టుదల ఈ సినిమా పట్ల ఆశావాహ దృక్పథం ఈ సినిమాను ఇంత వరకూ తెచ్చాయి. మేమే ఆయన దారిలోకి వెళ్లి పనిచేసాం. పరుచూరి బ్రదర్స్ కథతో ప్రయాణం చేసారు. ‘రంగు’ లో కనిపించే క్రోథం ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడ
ముంచుతుంది అనేది కథ, లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్ లా మిగలుతుంది. ఈ సినిమా తో స్టార్స్ అయినా నేల మీద నక్షత్రాలుగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటుడు పరుచూరి రవి మాట్లాడుతూ:
‘‘యువత ఆలోచనలకు దగ్గరగా ఉండే సినిమా ఇది. రెగ్యులర్ పోలీస్ పాత్రలకంటే భిన్నంగా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా తనీష్ కి మంచి బ్రేక్ నిస్తుంది. అలాగే ‘రంగు ’ పనిచేసిన వారందరికీ మంచి గుర్తింపు నిస్తుందని నమ్ముతున్నాను. మౌనపోరాటం, సర్పయాగం, కర్తవ్యం సినిమాలలాగా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమాలో యువతకు సిరివెన్నెల గారు ఒక ప్రశ్నవేసాడు ‘ ఎక్కడ ఉంది చక్కుముడి’అనే పాట వారి ఆలోచనలను కదిలిస్తుంది. ఇది సాధారణ యువకుల జీవితం ని ఆవిష్కరించే కథ ’ అన్నారు.

నటుడు షఫి మాట్లాడుతూ:
‘‘పదేళ్ల క్రితం సిరివెన్నెల గారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా అనే పాట తర్వాత ఇప్పుడ ఎక్కడ ఉంది చిక్కుముడి అని సమాజాన్ని ప్రశ్నించేటట్లు , ఒడిదుకులు గురించి అొంత అద్భుతంగా రంగు కథ కోసం ఆయన కలం కదిలింది. అలాగే దర్శకుడు కార్తికేయ ఈ కథ కోసం పడిన తపన అంతా ఇంతా కాదు. విజయవాడలో కొంతమందిని ఆర్టిస్ట్ లుగా తయారు చేసుకున్నాడు. యూనిట్ అందరికీ కథను ఇంజెక్ట్ చేసాడు దర్శకుడు కార్తికేయ. నిర్మాతలు ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాను. తనీష్ కి ఈ సినిమా
జీవితంలో ఎన్నో రంగులు నింపాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

 

హీరో త‌నీశ్ మాట్లాడుతూ – “నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు అయ్యింది. నా తొలి సినిమా హిట్ అయిన రోజు నాకు చాలా ఆనంద‌మేసింది. చాలా ఏళ్ల త‌ర్వాత ఇంత ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు వంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌నిచేశాను. చాలా రోజుల త‌ర్వాత మా అమ్మ నాకోసం ఈ ఫంక్ష‌న్‌కు వ‌చ్చారు. నా ఎక్స్‌డెంటెడ్ ఫ్యామిలీతో జ‌రుపుకుంటున్న తొలి ఫంక్ష‌న్. ఈ మూడు కార‌ణాల‌తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయ‌గారు సినిమాను నాతో చేసినందుకు ఆయ‌న‌కు
థాంక్స్‌. నా నిర్మాతలు ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారికి , నాయుడుగారు, వాసు గారికి థాంక్స్. ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు ఇండ‌స్ట్రీలో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. సురేంద‌ర్ రెడ్డిగారు అద్భుత‌మైన విజువ‌ల్స్
అందించారు. యోగి అన్న అందించిన రీరికార్డింగ్ మా పెర్ఫామెన్స్‌ల‌ను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ర‌వి అన్న‌కు.. థాంక్స్‌. చాలా మంచి క్యారెక్ట‌ర్‌లో మెప్పిస్తాడు. ష‌ఫీగారు మ‌రో అద్భుత‌మైన రోల్‌లో
మెప్పిస్తాడు. ఆయ‌న‌తో వ‌ర్క్‌చేయ‌డాన్ని గొప్ప‌గా భావిస్తాను. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుండి వ‌చ్చిన ప్రియా చ‌క్క‌గా న‌టించింది. ఇందులో హీరోలు, విల‌న్స్ లేరు.. అన్ని పాత్ర‌లే. ప్ర‌తి పాత్ర ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌ద‌నే విష‌యాల‌ను నేర్పిస్తుంది. ఈ నెల 23న మా సినిమా పోస్ట‌ర్ ప‌డుతుంది. సినిమా విడుద‌ల‌వుతుంది“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కార్తికేయ మాట్లాడుతూ – “24 క్రాఫ్ట్స్‌తో సినిమా చేయ‌డం అంటే కాస్త బ‌రువుతో కూడుకున్న విష‌యం. ద‌ర్శ‌కుడిగా తొలి చిత్రం కాబ‌ట్టి డిఫ‌రెంట్ స్టోరీతో సినిమా చేయాల‌నుకున్నాను. క‌థ‌కు,
క్యారెక్ట‌ర్స్‌కు అవ‌కాశం ఉండి.. సోసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండే సినిమా చేయాల‌నుకుంటున్న త‌రుణం. అప్పుడు ఓ ఫ్రెండ్ ద్వారా లారా గురించి విన్నాను. ఆయ‌న స్నేహితుల‌ను క‌లిసి క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.
దాన్ని చ‌క్క‌గా ప్రెజెంట్ చేసేదెవ‌రు? అని ఆలోచించి పరుచూరి బ్ర‌ద‌ర్స్‌ను క‌లిశాను. వాళ్లు దీన్ని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లోకి మార్చి అద్భుతంగా మ‌లిచారు. 350పైగా సినిమాలు చేసిన వ్య‌క్తుల అనుభవం
ఎంటో నాకు తెలిసింది. యోగీశ్వ‌ర శ‌ర్మ‌గారు సంగీతం కీ రోల్ పోషించింది. పాట‌ల‌తో పాటు.. బ్యాగ్రౌండ్ స్కోర్‌పై గ్రిప్ ఉన్న వ్య‌క్తి కావాల‌నుకున్న త‌రుణంలో శ్రీకారం చుడుతున్న‌ట్లు.. పాట విన్నాను. ఆ సాంగ్ విని.. యోగీశ్వ‌ర శ‌ర్మ‌గారిని క‌లిశాను. ఆయ‌న నాకెంటే ఎక్కువ‌గా ఓన్ చేసుకుని బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అద్భుతంగా ఇచ్చారు. గురువుగారు సీతారామ‌శాస్త్రిగారు.. సాయికిర‌ణ్‌గారు అద్భుత‌మైన సాహిత్యం ఇచ్చారు. సినిమాటోగ్రాఫ‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారు ఓ టీచ‌ర్‌లా మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించారు. ఆయ‌నొక పిల్ల‌ర్‌లా నిల‌బ‌డి సినిమా బాగా రావ‌డానికి
తోడ్ప‌డ్డారు. ష‌ఫీగారు త‌న న‌ట‌న‌తో సినిమాను నిల‌బెడ‌తారు. మ‌ల్లిడి ర‌వి, మితిలేష్‌.. అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. ర‌వి అన్న‌య్య అద్భుత‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ఆయ‌న పోషించిన క్యారెక్ట‌ర్ గురించి ప‌దేళ్లు చెప్పుకునేంత గొప్ప‌గా ఉంటుంది. నిర్మాత ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారు ఎంత చెప్పినా త‌క్కువే. కొత్త డైరెక్ట‌ర్‌ను న‌మ్మి నాకొక గురువులా, తండ్రిలా, స్నేహితుడిలా, అన్న‌య్య‌లా నాకు స‌పోర్ట్ అందించారు. టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకుంటారు. తనీశ్ .. ఓ కంప్లీట్ హ్యుమ‌న్ బీయింగ్‌. ఈ క్యారెక్ట‌ర్‌ను.. త‌నీశ్‌ను ఓ రెఫ‌రెన్స్‌లా
తీసుకునేంత గొప్ప‌గా న‌టించారు. లారా అనే క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయారు. ఇన్‌టెన్స్‌తో న‌టించారు. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్‌“ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OPALOj

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...